కెప్టెన్సీ డెబ్యూలో వైభవ్‌ విఫలం | Chetan Sakariya Spoils Vaibhav Sooryavanshi Captaincy Debut In SMAT 2026 | Sakshi
Sakshi News home page

కెప్టెన్సీ డెబ్యూలో వైభవ్‌ విఫలం

Nov 14 2026 11:58 AM | Updated on Nov 14 2026 12:05 PM

Chetan Sakariya Spoils Vaibhav Sooryavanshi Captaincy Debut In SMAT 2026

source: X

టీమిండియా బ్యాటింగ్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ దేశవాలీ కెప్టెన్సీ అరంగేట్రంలో విఫలమయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026 కోసం బిహార్ కెప్టెన్‌గా ఎంపికైన అతడు.. సౌరాష్ట్రతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే ఔటై నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించినప్పటికీ, స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ల సాయంతో 18 పరుగులు చేసి చేతన్ సకారియా బౌలింగ్‌లో అతడికే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో బిహార్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అలోక్‌ కుమార్‌తో పాటు ఓపెనింగ్‌కు దిగిన వైభవ్‌.. తొలుత తన సహజ శైలిలో భారీ షాట్లు ఆడాడు. అయితే దురదృష్టవశాత్తు చేతన్‌ సకారియా బౌలింగ్‌లో ఔటయ్యాడు. వైభవ్‌ ఔటయ్యాక బిహార్‌ స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

వైభవ్‌కు ముందు అకోక్‌ కుమార్‌ 4 పరుగులకే ఔట్‌ కాగా.. వైభవ్‌ తర్వాత ఆయుశ్‌ లోహారుకా 9, అల్తమిష్‌ అష్రఫ్‌ 24 పరుగులకే ఔటయ్యారు. 12 ఓవర్ల తర్వాత బిహార్‌ స్కోర్‌ 77-4గా ఉంది. రఘువేంద్ర ప్రతాప్‌ సింగ్‌ 12, పృథ్వీ రాజ్‌ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్‌ సకారియా, ప్రేరక్‌ మన్కడ్‌, క్రియాన్స్‌ ఫులెట్రా తలో వికెట్‌ తీయగా.. అలోక్‌ కుమార్‌ రనౌటయ్యాడు. 

సరికొత్త చరిత్ర
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బిహార్ సీనియర్ జట్టుకు నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో ఒక జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 

అయితే ఈ టోర్నీలో వైభ‌వ్ ఈ ఒక్క మ్యాచ్‌కు మాత్ర‌మే కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండటం కొసమెరుపు. ఈ మ్యాచ్‌ తర్వాత అతడు రైజింగ్ స్టార్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ కోసం ఖ‌తార్‌కు ప‌య‌న‌మ‌వుతాడు. ఆ టోర్న‌మెంట్‌లో వైభ‌వ్ తిల‌క్ వ‌ర్మ సార‌థ్యంలోని ఇండియా 'ఎ' జట్టు తరపున ఆడనున్నాడు. ఈ టోర్నీలో వైభవ్‌, తిలక్‌తో పాటు అభిషేక్‌ శర్మ తదితర టీమిండియా స్టార్లు పాల్గొంటారు. 

ఇదీ చదవండి: విధ్వంసం సృష్టించిన టీమిండియా మాజీ కెప్టెన్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement