జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా పృథ్వీ షా! | SMAT 2026: Ruturaj Gaikwad Prithvi Shaw Named In Maharashtra squad | Sakshi
Sakshi News home page

జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా పృథ్వీ షా!.. మరి రుతురాజ్‌?

Nov 10 2026 1:43 PM | Updated on Nov 10 2026 1:47 PM

SMAT 2026: Ruturaj Gaikwad Prithvi Shaw Named In Maharashtra squad

PC: Maharashtracricket/BCCI

దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2026 ఎడిషన్‌కు సంబంధించి మహారాష్ట్ర క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో టీమిండియా స్టార్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు చోటు దక్కింది. అదే విధంగా పృథ్వీ షా కూడా ఈ జట్టులో ఉన్నాడు.

అయితే, వీరిద్దరిలో కెప్టెన్‌ ఎవరన్న అంశంపై మాత్రం మహారాష్ట్ర క్రికెట్‌ స్పష్టతనివ్వలేదు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్లేయర్లకు కూడా ఈసారి జట్టులో అవకాశం దక్కింది. సీనియర్‌ రాహుల్‌ త్రిపాఠితో పాటు.. యువ స్టార్‌ ఆల్‌రౌండర్‌ అర్షిన్‌ కులకర్ణికి సెలక్టర్లు చోటిచ్చారు.

కాగా 2009-2010 సీజన్‌లో మహారాష్ట్ర దేశీ టీ20 టోర్నీలో ట్రోఫీ గెలిచింది. ఇక ఈసారి నవంబరు 14- 26 మధ్య సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ గ్రూప్‌ దశలో భాగంగా మహారాష్ట్ర జట్టు మొహాలీ, చండీగఢ్‌లో మ్యాచ్‌లు ఆడుతుంది.

ఇక ఈసారి కెప్టెన్‌ విషయంలో మాత్రం మహారాష్ట్ర ఇంత వరకు క్లారిటీ ఇవ్వకపోయినా.. పృథ్వీ షా లేదంటే రుతురాజ్‌ సారథిగా వ్యవహరించడం తెలిసిన విషయమే. రుతు భారత్‌-ఎ, టీమిండియాలో చోటు దక్కించుకోవడంతో ఇటీవల రంజీ ట్రోఫీ 2026-27 మ్యాచ్‌లలో పృథ్వీ షా కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఇదిలా ఉంటే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఎలైట్‌ గ్రూప్‌-‘సి’లో ఉన్న మహారాష్ట్ర.. తమ తొలి మ్యాచ్‌లో భాగంగా నవంబరు 14న పుదుచ్చేరితో తలపడుతుంది. ఆ తర్వాత కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌, అసోం, మధ్యప్రదేశ్‌, త్రిపుర, ఆంధ్ర జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది.

కాగా ఆరంభ మ్యాచ్‌లలో పృథ్వీ షా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. ఎందుకంటే రుతురాజ్‌ ప్రస్తుతం భారత వన్డే జట్టుతో కలిసి న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్నాడు. కివీస్‌తో వన్డే సిరీస్‌ నవంబరు 15తో ముగుస్తుంది.

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2026 టోర్నీకి మహారాష్ట్ర జట్టు
పృథ్వీ షా, రుతురాజ్‌ గైక్వాడ్‌, అర్షిన్‌ కులకర్ణి, సాహిల్‌ పరేఖ్‌, రాహుల్‌ త్రిపాఠి, సూరజ్‌ షిండే, రామకృష్ణ ఘోష్‌, ముకేశ్‌ చౌదరి, తనయ్‌ సంఘ్వీ, విక్కీ ఓస్త్వాల్‌, కిరణ్‌ చర్మోలే, రంజిత్‌ నికమ్‌, ప్రదీప్‌ దాధే, రుషికేశ్‌ సొనావ్నే, వికేక్‌ షెలార్‌, హితేశ్‌ వలుంజ్‌, ప్రశాంత్‌ సోలంకి, సిద్ధేశ్‌ వీర్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement