Asia Cup: తొలిసారి శతక్కొట్టిన ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ | ACC Men's U19 Asia Cup 2026 IND vs UAE: Aaryavir Sehwag Slams Century | Sakshi
Sakshi News home page

Asia Cup: తొలిసారి శతక్కొట్టిన ఆర్యవీర్‌ సెహ్వాగ్‌

Nov 10 2026 12:45 PM | Updated on Nov 10 2026 12:59 PM

ACC Men's U19 Asia Cup 2026 IND vs UAE: Aaryavir Sehwag Slams Century

PC: BCCI X

టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ పెద్ద కుమారుడు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ తొలిసారి భారత్‌ తరఫున శతక్కొట్టాడు. ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2026 వన్డే టోర్నీలో భాగంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. అల్‌ ఎమిరెట్‌ వేదికగా గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌- యూఏఈ అండర్‌-19 జట్లు మంగళవారం బరిలోకి దిగాయి. 

టాస్‌ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్‌ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఈ క్రమంలో భారత ఓపెనర్లలో, కెప్టెన్‌ లక్ష్య రాయ్‌చందాని 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించగా.. మరో ఓపెనర్‌ ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ ఆది నుంచే నిలకడగా ఆడాడు. ఈ క్రమంలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ 69 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

ఆ తర్వాత కూడా నిలకడగానే ముందుకు సాగిన ఆర్యవీర్‌.. 131 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది వంద పరుగుల మార్కు అందుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement