దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్ల ప్రకటన | India Womens squad for all format tour of South Africa announced | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్ల ప్రకటన

Nov 10 2026 8:09 AM | Updated on Nov 10 2026 8:09 AM

India Womens squad for all format tour of South Africa announced

source: X

దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత మహిళల క్రికెట్‌ జట్లను ప్రకటించారు. డిసెంబర్‌లో జరిగే ఈ ఆల్‌ ఫార్మాట్ టూర్ కోసం బీసీసీఐ మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది. ఈ పర్యటనలో భారత్ ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.

మూడు ఫార్మాట్లలో స్మృతి మంధన భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. టెస్టు, వన్డేల్లో దీప్తి శర్మ వైస్ కెప్టెన్‌గా ఉండగా.. టీ20ల్లో షఫాలీ వర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. తాజా మాజీ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మూడు ఫార్మాట్లలో సాధారణ ప్లేయర్‌గా కొనసాగనుంది.

టెస్ట్ జట్టు: స్మృతి మంధాన (C), షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ (WK), యాస్తికా భాటియా (WK), దీప్తి శర్మ (VC), శ్రీ చరణి, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, నందిని శర్మ, జింటమణి కలిత, సయాలీ సత్ఘరే

వన్డే జట్టు: స్మృతి మంధాన (C), షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ (WK), యాస్తికా భాటియా (WK), దీప్తి శర్మ (VC), శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్‌, నందిని శర్మ, జింటమణి కలిత, సయాలి సత్ఘరే

టీ20 జట్టు: స్మృతి మంధాన (C), షఫాలీ వర్మ (VC), జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, నికి ప్రసాద్, రిచా ఘోష్ (WK), G. కమలిని (WK), అనుష్క శర్మ, దీప్తి శర్మ, శ్రీ చరణి, ప్రేమ రావత్, అమంజోత్ కౌర్,క్రాంతి గౌడ్‌, నందిని శర్మ, రేణుకా సింగ్‌, అరుంధతి రెడ్డి, సయాలి సత్ఘరే

షెడ్యూల్
డిసెంబర్ 9న ఏకైక టెస్టుతో ఈ పర్యటన ప్రారంభం కానుంది. అనంతరం మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

డిసెంబర్ 9- ఏకైక టెస్టు- గ్కెబెర్హా
డిసెంబర్ 16- తొలి వన్డే- పార్ల్  
డిసెంబర్ 19- రెండో వన్డే- కేప్‌టౌన్
డిసెంబర్ 22- మూడో వన్డే- బ్లూమ్‌ఫోంటెయిన్
డిసెంబర్ 26- తొలి టీ20- బెనోని
డిసెంబర్ 29- రెండో టీ20- పోట్చెఫ్‌స్ట్రూమ్
డిసెంబర్ 30- మూడో టీ20- పోట్చెఫ్‌స్ట్రూమ్

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన జింబాబ్వే


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement