ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీలు..? | IPL eyes two new franchises from 2028, Pune and Vadodara among frontrunners Says Report | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీలు..?

Nov 10 2026 11:45 AM | Updated on Nov 10 2026 11:45 AM

IPL eyes two new franchises from 2028, Pune and Vadodara among frontrunners Says Report

source: IPL X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కొత్తగా రెండు జట్లు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2028 సీజన్‌ నుంచి లీగ్‌ను మరింత విస్తరించేందుకు బీసీసీఐ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కొత్త ఫ్రాంచైజీలకు ఆతిథ్య నగరాలుగా పుణే, వడోదర పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు సమాచారం.

పెరుగుతున్న ఫ్రాంచైజీల విలువలు
ఇటీవల ఐపీఎల్‌ ఫ్రాంచైజీల విలువ గణనీయంగా పెరిగింది. రెండు కీలక యాజమాన్య లావాదేవీలు కూడా ఫ్రాంచైజీల విలువల పెరుగుదలకు దోహదపడ్డాయి. ఈ నేపథ్యంలో మరో రెండు జట్లను ప్రవేశపెట్టడం ద్వారా లీగ్‌ ఆదాయం, వాణిజ్య అవకాశాలను మరింత పెంచుకోవచ్చని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2028 నుంచి ఐపీఎల్‌లో పది జట్లకు బదులు 12 జట్లు పాల్గొంటే బీసీసీఐ ఆదాయం మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ, గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, కేకేఆర్‌, ఢిల్లీ, పంజాబ్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి: క్రికెట్‌ స్కాట్లాండ్‌ సంచలన నిర్ణయం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement