ఆ బాలికకు పదేళ్లే.. శివాలయానికి వెళ్లి భక్తితో స్వామివారికి మొక్కుకుంది. పూజ ముగించుకుని చేతులు జోడించి ప్రార్థిస్తున్న ఆ చిన్నారిపై ఓ కామాంధుడు కన్నేశాడు. ఆలయంలో ఎవరూ లేరని గమనించి ఆమెను బలవంతంగా పట్టుకుని లైంగిక దాడికి యత్నించాడు. ఈ దారుణ ఘటన ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘోరం రికార్డవడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
శివాలయానికి బాలిక ఒంటరిగా వెళ్లి పూజలు చేసింది. అనంతరం లింగానికి మొక్కుకుని చేతులు జోడించి ప్రార్థిస్తున్న సమయంలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆలయం బయట ఉన్న ట్యాంకు నుంచి నీళ్లు తీసుకునేందుకు వచ్చిన అతడు.. లోపల బాలిక ఒక్కతే ఉండటాన్ని గమనించాడు. ఆలయంలోకి ప్రవేశించి చిన్నారిని చేతులతో బలవంతంగా పట్టుకుని, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో భయపడిపోయిన బాలిక గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. మహారాష్ట్ర పుణెలోని నిగ్డీ ప్రాంతంలో ఉన్న శివాలయంలో ఈ దారుణం జరిగింది.
కుటుంబానికి చెప్పడంతో వెలుగులోకి..
నిందితుడు వెళ్లిపోయిన తర్వాత బాలిక కన్నీటిపర్యంతమైంది. అనంతరం కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో వారు నిగ్డీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు విశాల్ సింగ్ను అరెస్ట్ చేశారు. అతడు ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తిగా, మెట్రో కాంట్రాక్టర్ వద్ద కూలీగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మహేశ్ బన్సోడే పర్యవేక్షణలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నారుల భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళన రేకెత్తించింది. దేవుడిని ప్రార్థించేందుకు వెళ్లిన బాలికకు ఆలయంలోనే ఇలాంటి అనుభవం ఎదురవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Shocking: Vishal Singh, a Metro construction contract worker, arrested for sexually assaulting a minor girl inside a temple in Nigdi’s Yamuna Nagar, Pune on Oct 11. CCTV captured the incident. Police booked him under BNS & POCSO. #Pune #Nigdi https://t.co/WB5Tnxf8mD
— Amar Singh Chouhan (@amar_4inc) October 12, 2026


