సౌతాఫ్రికాతో టెస్ట్‌లకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌ ఎంట్రీ | England bring back Bethell, leave out Bashir for three Test tour of South Africa | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికాతో టెస్ట్‌లకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌ ఎంట్రీ

Nov 10 2026 9:14 AM | Updated on Nov 10 2026 9:14 AM

England bring back Bethell, leave out Bashir for three Test tour of South Africa

source: X

త్వరలో సౌతాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్ కోసం 15 మంది సభ్యుల ఇంగ్లండ్‌ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా జో రూట్ నియమించబడగా.. స్టార్‌ ప్లేయర్‌ జేకబ్‌ బేతెల్‌ రీఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపించారు. 

ఇటీవల పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ కోసం జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఓలీ పోప్‌కు కూడా జట్టులో చోటు దక్కలేదు. ఈ పర్యటన ఇంగ్లండ్ నూతన ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు తొలి అసైన్‌మెంట్ కానుంది.

బేతెల్‌కు పునరాగమనం.. బషీర్‌పై వేటు
భారత్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా మోకాలి గాయానికి గురైన జేకబ్ బేతెల్.. పూర్తిగా కోలుకోవడంతో తిరిగి టెస్టు జట్టులోకి వచ్చాడు. అతడి రాకతో ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగానికి మరింత బలం చేకూరనుంది.

అయితే స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు మాత్రం ఈసారి జట్టులో చోటు దక్కలేదు. అతడి స్థానంలో ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయని ఎడమచేతి వాటం స్పిన్నర్ లియామ్ ప్యాటర్సన్-వైట్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు.

ఇటీవల కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ప్యాటర్సన్-వైట్ అద్భుతంగా రాణించాడు. డివిజన్-1లో స్పిన్నర్లలో అత్యధికంగా 42 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 75 మ్యాచ్‌లు ఆడిన ప్యాటర్సన్‌ 33.40 సగటుతో 184 వికెట్లు పడగొట్టాడు.

దక్షిణాఫ్రికా టెస్ట్‌లకు ఇంగ్లండ్ జట్టు: జో రూట్ (సి), జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, సోనీ బేకర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, ఎమిలియో గే, డాన్ లారెన్స్, లియామ్ ప్యాటర్సన్-వైట్, ఓలీ రాబిన్సన్‌, జేమీ స్మిత్‌, జోష్‌ టంగ్‌

కాగా, ఇంగ్లండ్‌ జట్టు సౌతాఫ్రికా పర్యటనలో టెస్ట్‌ సిరీస్‌తో పాటు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కూడా ఆడనుంది. టెస్ట్‌ సిరీస్‌కు ముందు ఓ వార్మప్‌ మ్యాచ్‌ కూడా ఆడనుంది. ఈ పర్యటనకు సం​బంధించిన పూర్తి షెడ్యూల్‌ ఇలా ఉంది.

సౌతాఫ్రికా-ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌ షెడ్యూల్‌
డిసెంబర్‌ 9,10- క్రికెట్‌ సౌతాఫ్రికా ఇన్విటేషన్‌ ఎలెవెన్‌తో 2 రోజుల వార్మప్‌ మ్యాచ్‌
డిసెంబర్‌ 17 నుంచి- తొలి టెస్ట్‌- జోహన్నెస్‌బర్గ్‌
డిసెంబర్‌ 26 నుంచి- రెండో టెస్ట్‌- సెంచూరియన్‌
జనవరి 3 నుంచి- మూడో టెస్ట్‌- కేప్‌టౌన్‌

జనవరి 10- తొలి వన్డే- పార్ల్‌
జనవరి 13- రెండో వన్డే- బ్లోంఫాంటీన్‌
జనవరి 15- మూడో వన్డే- బ్లోంఫాంటీన్‌

ఇదీ చదవండి: దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్ల ప్రకటన


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement