ఆస్ట్రేలియాతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్ గాయం కారణంగా ఆసీస్ టూర్ మొత్తానికి దూరమయ్యాడు. నవంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ సుదీర్ఘ పర్యటనలో ఇంగ్లండ్ జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు శనివారం అధికారికంగా ప్రకటించింది. సిరీస్ సన్నాహకాల్లో భాగంగా ప్రాక్టీస్ చేస్తుండగా టంగ్ కాలి వేలికి గాయమైనట్లు ఈసీబీ తెలిపింది. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న టంగ్.. తన గాయం నుంచి కోలుకునేందుకు తిరిగి యూకేకు పయనం కానున్నాడు. టంగ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల పాకిస్తాన్ వేదికగా జరిగిన వన్డే త్రైపాక్షిక సిరీస్‌లో రాణించాడు.
కాగా 2025 మధ్య నాటి వరకు ఇంగ్లండ్ బెంచ్ కే పరిమితమైన జోష్ టంగ్.. ఆ తర్వాత ఊహించని రీతిలో రాణించాడు. భారత్‌తో జరిగిన సిరీస్ మధ్యలో జట్టులోకి వచ్చి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2025-26 యాషెస్ సిరీస్‌లో కేవలం 3 టెస్టుల్లోనే 20.11 సగటుతో 18 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు.
ఇంగ్లండ్ వన్డే జట్టు
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జాకబ్ బెతెల్, జోర్డాన్ కాక్స్, హెన్రీ క్రోకోంబ్, సామ్ కరన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్,
ఇంగ్లండ్ టీ20 జట్టు
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), టామ్ బాంటన్, జాకబ్ బెతెల్, జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్, హెన్రీ క్రోకోంబ్, సామ్ కరన్, లియామ్ డాసన్, అన్యూరిన్ డొనాల్డ్, ఎడ్డీ జాక్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, థామస్ ర్యూ, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్.


