breaking news
Josh Tongue
-
Ashes: మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు
ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. పేలవ ప్రదర్శనతో తేలిపోయిన పేసర్ గస్ అట్కిన్సన్ను జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో మరో కుడిచేతి వాటం పేసర్‌నే ప్లేయింగ్ ఎలెవన్‌కు ఎంపిక చేసింది.2-0తో ఆధిక్యంలో ఆసీస్కాగా ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆతిథ్య ఆసీస్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes 2025-26)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు స్టోక్స్ బృందం అక్కడికి వెళ్లింది. ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా ప్రస్తుతానికి 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.ఇలా కంగారూలు సొంతగడ్డపై ఆధిపత్యం కొనసాగిస్తుండగా.. ఇంగ్లండ్ మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. ముఖ్యంగా కీలక పేసర్ అయిన గస్ అట్కిన్సన్ (Gus Atkinson) ధారాళంగా పరుగులు (సగటున 78.6) ఇచ్చుకుంటూ.. అదే స్థాయిలో వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లో.. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి అతడు కేవలం మూడే వికెట్లు పడగొట్టాడు.అతడిపై వేటుఈ నేపథ్యంలో అట్కిన్సన్పై వేటు వేసిన ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం.. అతడి స్థానంలో మరో రైటార్మ్ పేసర్ జోష్ టంగ్ (Josh Tongue)ను తుదిజట్టుకు ఎంపిక చేసింది. దీంతో మాథ్యూ పాట్స్‌కు మరోసారి నిరాశే మిగిలింది. ఈ ఒక్క మార్పు తప్ప రెండో టెస్టులో ఆడిన జట్టునే ఇంగ్లండ్ కొనసాగించింది.బషీర్‌కు మరోసారి మొండిచేయిమరోవైపు.. స్పెషలిస్టు స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు మరోసారి మొండిచేయి చూపిన మేనేజ్మెంట్.. స్పిన్ ఆప్షన్ కోటాలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌ను కొనసాగించింది.ఇదిలా ఉంటే.. ఓవైపు ఆసీస్ పేసర్లు విజృంభిస్తున్న పిచ్‌లపై ఇంగ్లండ్ సీమర్లు మాత్రం తేలిపోతున్నారు. నిజానికి జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. కాగా ఆసీస్- ఇంగ్లండ్ మధ్య బుధవారం (డిసెంబరు 17) నుంచి మూడో టెస్టు మొదలుకానుంది. ఇందుకు అడిలైడ్‌లోని అడిలైడ్ ఓవల్ మైదానం వేదిక.ఆస్ట్రేలియాతో యాషెస్ మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్.చదవండి: అక్కడే లాక్ అయిపోయాం: బాండీ బీచ్ ఘటనపై మైకేల్ వాన్ -
ఐపీఎల్ వేలంలో ఆ నలుగురికి భారీ ధర!.. అతడిని ముంబై కొనొచ్చు!
ఐపీఎల్ మినీ వేలం-2026 నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంపాటలో ఇంగ్లండ్ ఆటగాళ్లకు మంచి ధర దక్కుతుందని అంచనా వేశాడు. ‘ది హండ్రెడ్’ లీగ్ (The Hundred)లో సత్తా చాటిన ‘ఆ నలుగురు’ అధిక ధరకు అమ్ముడుపోతారంటూ జోస్యం చెప్పాడు.ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడుఅయితే, వాళ్లు ఇంత వరకు ఒక్కసారి కూడా క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడకపోవడం విశేషం. ఇంతకీ ఎవరా నలుగురు?!... తన యూట్యూబ్ షో అశ్ కీ బాత్‌లో అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘ఇంత వరకు ఐపీఎల్లో ఆడని ప్లేయర్..కానీ ఈసారి వేలంలో మాత్రం అధిక ధర పలికే అవకాశం ఉంది. అతడు మరెవరో కాదు జోర్డాన్ కాక్స్ (Jordan Cox).ఓవల్ ఇన్విసిబుల్స్ తరఫున అతడు అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. 24 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. ముంబై ఇండియన్స్ అతడపై ఆసక్తి చూపవచ్చు. అతడిని సొంతం చేసుకోవచ్చు కూడా!సోనీ బేకర్ సూపర్ఇక రెండో ఆటగాడు ఎవరంటే.. టీమిండియాతో టెస్టు సిరీస్‌లో జోష్ టంగ్ మెరుగ్గా ఆడాడు. అయితే, మాంచెస్టర్ ఒరిజినల్స్ తరఫున అతడు బౌలర్‌గా గొప్పగా రాణించాడు. అదే జట్టు నుంచి మరో ప్లేయర్ కూడా మెరుగ్గా ఆడాడు. అతడే సోనీ బేకర్.అద్భుతమైన ఇన్స్వింగర్లతో ప్రత్యర్థులను భయపెట్టాడు. కొత్త బంతితో మెరుగ్గా రాణించాడు. ఇక రెహాన్ అహ్మద్ .. ఈసారి బౌలింగ్‌తో కన్నా బ్యాటింగ్‌తో వార్తల్లో నిలిచాడు. మూడు, నాలుగు స్థానాల్లో వచ్చి రాణించాడు. లెగ్ స్పిన్నర్‌గానూ సేవలు అందించగలడు’’ అని పేర్కొన్నాడు.నలుగురి ప్రదర్శన ఇలాకాగా ది హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన పేసర్ జోష్ టంగ్.. పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. ఓవల్ ఇన్విసిబుల్స్ తరఫున ఆడిన వికెట్ కీపర్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్.. 367 పరుగులు సాధించాడు.ఇక మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు ఆడిన యువ పేసర్ సోనీ బేకర్ తొమ్మిది వికెట్లతో సత్తా చాటగా.. ట్రెంట్ రాకెట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన స్పిన్ ఆల్‌రౌండర్ రెహాన్ అహ్మద్.. 189 పరుగులు చేయడంతో పాటు 12 వికెట్లు కూడా తీశాడు. ఇదిలా ఉంటే.. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్.. ఇటీవలే ఐపీఎల్‌కూ కూడా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.చదవండి: ‘భారత క్రికెట్ బాగుండాలంటే.. రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు ఆడాలి’


