కెప్టెన్‌గా రీఎంట్రీ.. ‘ట్రోఫీని ఇంటికి తీసుకొస్తా’ | Suryakumar-Yadav Named Mumbai Captain-SMAT-2026-Officially Announced | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌గా రీఎంట్రీ.. ‘ట్రోఫీని ఇంటికి తీసుకొస్తా’

Nov 9 2026 7:08 PM | Updated on Nov 9 2026 7:22 PM

Suryakumar-Yadav Named Mumbai Captain-SMAT-2026-Officially Announced

Photo Credit: Twitter

టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు ప్రమోషన్ లభించింది. 2026 సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ముంబై జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహించనున్నాడు. రెండు రోజుల కిందటే సూర్యకు కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి అప్పగించనున్నట్లు ఊహాగానాలు వ్యక్తమయిన వేళ ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

ఇక సూర్యకుమార్ ఐపీఎల్ 2026 సీజన్‌లో చివరిసారిగా ఆడాడు. అంతకముందు అతడి కెప్టెన్సీలో టీమిండియా 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా సక్సెస్ అయినప్పటికీ, బ్యాటర్‌గా విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. అప్పటినుంచి భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సూర్యకుమార్ కష్టపడుతూనే ఉన్నాడు.

తాజాగా ముంబైకి కెప్టెన్‌గా ఎంపికవ్వడంపై సూర్యకుమార్ స్పందించాడు. ‘‘ముంబైకి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ గౌరవంగానే భావిస్తాను. కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పి దానికి మరింత బాధ్యత తీసుకొచ్చారు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు, యువ ప్రతిభావంతులతో జట్టు సమతుల్యంగా కనిపిస్తోంది. ప్రతీ మ్యాచ్‌లోనూ జట్టుగా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామన్న నమ్మకంతో ఉన్నాం. అంతిమంగా ట్రోఫీని ఇంటికి తీసుకురావడమే మా లక్ష్యం’’ అని చెప్పుకొచ్చాడు.

సూర్యకుమార్ యాదవ్‌, అంగ్‌క్రిష్ రఘువంశీ, సర్ఫరాజ్ ఖాన్‌, శార్దూల్ ఠాకూర్‌, తుషార్ దేశ్‌పాండేలతో పటిష్టంగా కనిపిస్తున్న ముంబై జట్టులోకి శివమ్ దూబే రాకతో జట్టు మరింత బలోపేతమైంది. అయితే ఈ సీజన్‌లో రంజీ ట్రోఫీలో ముంబై కెప్టెన్‌గా వ్యవహరించిన సిద్దేశ్ లాడ్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై నవంబర్ 14న హైదరాబాద్‌తో తమ తొలి మ్యాచ్‌ను ఆడనుంది.

ముంబై జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), అంగ్‌క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్‌), దివ్యాన్ష్ సక్సేనా, సువేద్ పార్కర్‌, ముషీర్ ఖాన్‌, సర్ఫరాజ్ ఖాన్‌, సాయిరాజ్ పాటిల్‌, శివమ్ దూబే, అథర్వ అంకోలేకర్‌, శార్దూల్ ఠాకూర్‌, తుషార్ దేశ్‌పాండే, షామ్స్ ములానీ, మాక్స్‌వెల్ స్వామినాథన్‌, మోహిత్ అవస్తి, సిల్వెస్టర్ డిసౌజా, హార్దిక్ టమోర్ (వికెట్ కీపర్‌)

ఇదీ చదవండి: విండీస్ స్పిన్న‌ర్ అరుదైన ఫీట్‌.. బంగ్లాపై టెస్టు సిరీస్ కైవ‌సం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement