Photo Credit: Twitter
జింబాబ్వే సీనియర్ ఆటగాడు క్రెయిన్ ఎర్విన్ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఫీట్ సాధించాడు. షార్జా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో క్రెయిగ్ ఎర్విన్ 161 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన రెండో అతిపెద్ద వయస్కుడిగా నిలిచాడు. ప్రస్తుతం క్రెయిగ్ ఎర్విన్ వయస్సు 41 ఏళ్ల 82 రోజులు.
ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మిస్బా ఉల్-హక్ (42 ఏళ్ల 47 రోజులు) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఎర్విన్ ఈ రికార్డు అందుకోకముందు విండీస్ దిగ్గజం శివనరైన్ చందర్‌పాల్ (40 ఏండ్ల 31 రోజులు) రెండో స్థానంలో ఉండగా, తాజాగా ఎర్విన్ చందర్‌పాల్‌ను అధిగమించాడు. ఇక మరో జింబాబ్వే సీనియర్ బ్రెండన్ టేలర్ (40 ఏళ్ల 272 రోజులు) మూడో స్థానంలో ఉన్నాడు.
👉ఇదే టెస్టులో మరో రికార్డు కూడా నమోదైంది. ఒక టెస్టు మ్యాచ్‌లో 40 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న బ్యాటర్లు సెంచరీలు నమోదు చేయడం ఇది మూడోసారి. ఆఫ్గన్‌తో మ్యాచ్‌లో సెంచరీలు చేసిన బ్రెండన్ టేలర్ వయసు 40 ఏళ్ల 272 రోజులు కాగా, తాజాగా సెంచరీతో మెరిసిన క్రెయిన్ ఎర్విన్ వయసు 41 ఏళ్ల 82 రోజులు.
👉గతంలో 2014లో ఆస్ట్రేలియాతో టెస్టులో పాకిస్తాన్ బ్యాటర్ మిస్బా ఉల్-హక్ ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు బాదడం విశేషం. 1926లో లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 40 ప్లస్ వయసు ఉన్న ముగ్గురు ఇంగ్లండ్ బ్యాటర్లు సెంచరీలు బాదారు. వీరిలో జాక్ హాబ్స్, వారెన్ బార్డ్స్‌లీ 40 ఏళ్లు ఉండగా, చార్లెస్ మెకార్తనే (39 ఏళ్ల 364 రోజులు) ఒక్కరోజు తక్కువ తేడాతో ఉన్నాడు.
👉ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఇప్పటికే ఆటకు చివరి రోజు కావడంతో తొలి టెస్టు డ్రాగా ముగియనుంది. టీ విరామ సమయానికి జింబాబ్వే తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 372 పరుగులతో ఆడుతున్నది. క్రెయిగ్ ఎర్విన్ (146 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), వెస్లే మదెవెరె (15 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
మిగిలిన బ్యాటర్లలో బ్రెండన్ టేలర్ (82), కెప్టెన్ బ్రియాన్ బెన్నెట్ (58), అంటుమ్ నఖ్వి (61) అర్థసెంచరీలతో అలరించారు. ఆఫ్గన్ బౌలర్లలో జియా ఉర్ అక్బర్ రెండు వికెట్లు తీయగా, మొహమ్మద్ సలీమ్, అబ్దుల్ మాలిక్‌లు చెరొక వికెట్ తీశారు. ప్రస్తుతం జింబాబ్వే 362 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
The feeling of scoring a Test century...Craig Ervine 😍 #AFGvZIM 📝:https://t.co/FkxGtToFdu https://t.co/7KO2mEW2D6
— Zimbabwe Cricket (@ZimCricketv) November 9, 2026
⚡️HISTORY MADE⚡️ Brendan Taylor, aged 40 years and 272 days scored a century on Day 1. Craig Ervine, aged 41 years and 82 days scored a 💯 today in the same Test. This is just the third instance in history where multiple players aged over 40 slammed tons in the same Test.
— Cricbuzz (@cricbuzz) November 9, 2026
ఇదీ చదవండి: రేపు మూడో వన్డే; గెలిస్తే చరిత్ర సృష్టించనున్న టీమిండియా!


