న్యాయపోరాటం ఓవైపు.. తండ్రి దుకాణం మరోవైపు! | Mercedes Car Crash Victim Daughter Takes Over His Dosa Shop at Kerala | Sakshi
Sakshi News home page

న్యాయపోరాటం ఓవైపు.. తండ్రి దుకాణం మరోవైపు!

Nov 18 2026 4:27 PM | Updated on Nov 18 2026 4:35 PM

Mercedes Car Crash Victim Daughter Takes Over His Dosa Shop at Kerala

కేరళ: కేరళలో మెర్సిడెస్ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జయబాలకృష్ణన్ కుటుంబానికి ఆయన 24 ఏళ్ల కుమార్తె భద్ర కీర్తి అండగా నిలిచింది. తండ్రి 26 ఏళ్లుగా నిర్వహిస్తున్న 'శ్రీకృష్ణ టీ స్టాల్‌'ను తిరిగి ప్రారంభించింది. తన తండ్రి జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకుంటూనే కుటుంబ పోషణ కోసం దోశలు, ఆమ్లెట్లు తయారు చేస్తూ దుకాణాన్ని నడుపుతోంది.

కొచ్చిలో తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 55 ఏళ్ల జయబాలకృష్ణన్ ప్రాణాలు కోల్పోయారు. రాత్రి 1.49 గంటలకు పని ముగించుకుని కుమార్తెతో మాట్లాడిన ఆయన ఇంటికి బయలుదేరారు. అయితే, తెల్లవారుజామున 2.20 గంటల సమయంలో గంటకు 104 కిలోమీటర్ల వేగంతో వచ్చిన మెర్సిడెస్ కారు ఆయన స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కారును 17 ఏళ్ల బాలుడు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

హైదరాబాద్‌లో ఫుడ్ క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న భద్ర కీర్తి.. తన ఉద్యోగం ద్వారా వచ్చే జీతం కుటుంబ ఖర్చులకు సరిపోవడం లేదని తెలిపింది. అందుకే తల్లి, సోదరుడితో కలిసి తండ్రి దుకాణాన్ని తిరిగి తెరిచినట్లు వెల్లడించింది. 26 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ దుకాణంతో తమకు ఎంతో అనుబంధం ఉందని, దాన్ని మూసివేయలేమని చెప్పింది.

ఓవైపు తండ్రి మరణంపై న్యాయపోరాటం కొనసాగిస్తూనే, కుటుంబ అవసరాల కోసం తల్లి, సోదరుడితో కలిసి దోశల దుకాణాన్ని తిరిగి తెరిచింది. అంతేకాదు ఈ షాపుతో తమకు ఎంతో అనుబంధం ఉందని, దాన్ని మూసివేయలేమని భద్ర కీర్తి తెలిపింది. తన తండ్రి మరణంపై న్యాయం కోసం హైకోర్టుతో పాటు అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని వెల్లడించింది.

ఇదీ చదవండి: దావూద్ ఇబ్రహీం భవనం కూల్చివేతపై వివాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement