సోనియా పుస్తకంపై శివసేన ఆగ్రహం.. నిషేధానికి డిమాండ్! | Sonia Gandhi book belonging ban demand shivsena | Sakshi
Sakshi News home page

సోనియా పుస్తకంపై శివసేన ఆగ్రహం.. నిషేధానికి డిమాండ్!

Nov 18 2026 1:36 PM | Updated on Nov 18 2026 1:39 PM

Sonia Gandhi book belonging ban demand shivsena

ముంబై: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో వివాదానికి కేంద్రంగా మారింది. ఈ పుస్తకంలో స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్‌ను, మరాఠీ గుర్తింపును అవమానించే అంశాలున్నాయంటూ ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ శివసేన నేతలు దానిలోని పేజీలను చించివేశారు.

శివసేన నేత సంజయ్ నిరుపమ్ ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను ప్రశ్నించారు. సావర్కర్‌ను, మరాఠీ గుర్తింపును అగౌరవపరిచే పుస్తకాన్ని ఉద్ధవ్ థాకరే ఎలా స్వీకరించారని నిలదీశారు. ఈ అంశంపై ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. గతంలో మణిశంకర్ అయ్యర్ వీర్ సావర్కర్‌ను అవమానించినప్పుడు బాలాసాహెబ్ థాక్రే తీవ్రంగా నిరసన తెలిపారని సంజయ్ నిరూపమ్ గుర్తుచేశారు. అప్పట్లో అయ్యర్‌పై చర్యలు తీసుకోవాలనే చర్చ కూడా జరిగిందన్నారు. మరి ఇప్పుడు సోనియా గాంధీ పుస్తకంపై ఉద్ధవ్ థాకరే ఎందుకు నిరసన వ్యక్తం చేయడం లేదని ప్రశ్నించారు. ఈ పుస్తకంలోని అంశాలు మరాఠీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని శివసేన ఆరోపిస్తోంది. 

ఇదీ చదవండి: రీల్స్‌ చేసేవారికి రక్షణ వర్తించదు: ఢిల్లీ పోలీసులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement