Record-breaking Karbi folk dance performance: అస్సాం కళాకారులు సాంప్రదాయ నృత్యం కర్బీతో రికార్డు సృష్టించారు. సుమారు 15 వేల మందికి పైగా నృత్యకారులు ఒకేచోట చేరి సంప్రదాయ కర్బీ జానపద నృత్యం 'నిమ్సో కెరుంగ్' ప్రదర్శించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. జిల్లా 75వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నవంబర్ 16 సోమవారం నాడు దిఫూలోని కాసా స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రదర్శనలో వివిధ తెగలు, వర్గాలకు చెందినవారు పాల్గొని, ఆ ప్రాంత సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పడానికి సమన్వయంతో నృత్యం చేశారు.
ఈ ఘనతను గిన్నిస్ ప్రపంచ రికార్డ్స్ న్యాయనిర్ణేత అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..'కర్బీ ఆంగ్లాంగ్' చరిత్ర సృష్టించింది. దాఆపు 15,000 మందికి పైగా నర్తకులు కలిసి ప్రదర్శన ఇచ్చారు." అనే క్యాప్షన్‌ని జోడించారు. నృత్యకారులు సాంప్రదాయ దుస్తులను ధరించి, కర్బీ సంగీ వాయిద్యాల లయలకు అనుగుణంగా నృత్యం చేస్తూ..స్టేడియంలో ఒక రంగుల దృశ్యాన్ని సృష్టించారు.
గిన్నిస్ రికార్డ్స్ అధికారిక న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగారికర్, ఈ నృత్యంలో పాల్గొన్నవారి ఉత్సాహాన్ని ప్రశంసించారు. పైగా వాళ్లు నృత్యం చేస్తూ సంబరాలు చేసుకోవడం చూస్తుంటే ఒళ్లు గగుర్పొడించిందన్నారు. అందుకే మళ్లీ ఇక్కడికి వచ్చి ఇలాంటివి మరిన్ని చూడాలనుకుంటున్నా అని అన్నారు. ఈ ప్రదర్శన ఐక్యతకు, సాంస్కృతిక సంప్రదాయాలకు ఒక అద్భుతమైన నిదర్శనమని అభివర్ణించారు.
కాగా, అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ అనే జిల్లా ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో నవంబర్ 15 నుంచి 17 వరకు జరిగి వేడుకల్లో భాగంగానే ఈ రికార్డు ప్రదర్శనను నిర్వహించారు. అస్సాం ముఖ్యమంత్రి బిస్వా శర్మ కూడా కళాకారులను అభింనందించారు. 1951లో కర్బీ ఆగ్లాంగ్ జిల్లా ఏర్పడిన జ్ఞాపకార్థం ప్రతి ఏడాది నవంబర్ 17న కర్బీ ఆంగ్లాంగ్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.
#WATCH | Diphu, Assam: Karbi Anglong has created history as the traditional Karbi folk dance Nimso Kerung sets a Guinness World Record. More than 15,000 dancers performed together. https://t.co/Hx5dUuCVzR
— ANI (@ANI) November 17, 2026
ఇదీ చదవండి: జీ.పీ.ఏ. ద్వారా ఆస్తి కొనవచ్చు కానీ..


