ఎప్‌స్టీన్‌ గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు : తాజా నివేదిక సంచలనం | Epstein Was Strangled Injuries Dont Match Suicid New Forensic Report Claims | Sakshi
Sakshi News home page

ఎప్‌స్టీన్‌ గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు : తాజా నివేదిక సంచలనం

Nov 18 2026 5:58 PM | Updated on Nov 18 2026 6:04 PM

Epstein Was Strangled Injuries Dont Match Suicid New Forensic Report Claims

లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) మరణంపై తాజాగా సందేహాలు మరోసారి  సంచలం రేపాయి. ఆయన పోస్ట్‌మార్టం నివేదికలోని ఆధారాలు అది ఆత్మహత్య కాదని, హత్య అని సూచిస్తున్నట్లు ఫోరెన్సిక్ నిపుణుల బృందం పేర్కొంది. ఆయన శరీరంపై ఉన్న గాయాలు ఉరివేసుకున్నప్పుడు ఉండే గాయాలతో సరిపోలడం లేదని  వీరు వెల్లడించారు. అయితే, న్యూయార్క్ సిటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం మాత్రం 2019లో తామిచ్చిన 'ఆత్మహత్య' నివేదికను మార్చడానికి నిరాకరించింది. తమ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.

ఫోరెన్సిక్ మెడిసిన్ నిపుణుడు మైఖేల్ ఫ్రీమాన్, స్వీడన్‌లోని ఉమియా విశ్వవిద్యాలయానికి చెందిన ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ ఆండర్స్ ఎరిక్సన్, మరియు కాగ్నిటివ్ న్యూరో సైంటిస్ట్ ఇటియెల్ డ్రోర్ సోమవారం లండన్‌లో ఈ కొత్త వివరాలను వెల్లడించారు.  అంతేకాకుండా, ఆయన శరీరంపై ఇతర గాయాలు లేదా దెబ్బలు ఏవీ లేవని, శరీరం "చాలా వరకు ఎటువంటి ఇతర గాయాలు లేకుండా శుభ్రంగా" ఉందని వారు పేర్కొన్నారు. "మెడపై ఉన్న గుర్తులు వెనుక నుండి ముడివేసిన సన్నని వస్త్రంతో గొంతు నులిమి హత్య చేసినట్లుగా (homicidal strangulation) స్పష్టంగా సూచిస్తున్నాయి" అని తమ ప్రజెంటేషన్‌లో తెలిపింది.

ఇదీ చదవండి: రెండేళ్లు స్నానం లేదు, ఆయన చావును కోరుకున్నారు : హేమా చౌదరి సంచలన వ్యాఖ్యలు

మరోవైపు, ఎప్‌స్టీన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తాము నిర్ధారించిన నివేదికకు కట్టుబడి ఉన్నామని న్యూయార్క్ సిటీ ఆఫీస్ ఆఫ్ చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ సోమవారం సీఎన్ఎన్ (CNN)తో పేర్కొంది. ఈ కొత్త నివేదిక నేపథ్యంలో ఎప్‌స్టీన్ సోదరుడు మార్క్ ఎప్‌స్టీన్ పూర్తి స్థాయి హత్య విచారణకు డిమాండ్ చేశారు. మంగళవారం సీఎన్ఎన్‌తో మాట్లాడిన మార్క్, ఈ తాజా అంశాల ఆధారంగా అధికారులు కేసును తిరిగి తెరవాలని కోరారు. తన సోదరుడు హత్యకు గురయ్యాడని,  పూర్తి స్థాయి హత్య విచారణను వారు ప్రారంభించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  తాజా రిపోర్ట్‌తో ఆయన ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదని స్పష్టమైందనీ, నివేదికలోని  అంశాలు "పూర్తిగా" నమ్మశక్యంగా ఉన్నాయని మార్క్ చెప్పారు.

ఇదీ చదవండి: కొలెట్ క్రెస్ Vs మాడిసన్ హువాంగ్ : ఏం జరగబోతోంది?

అమెరికాను కుదిపేసిన సెక్స్‌ కుంభకోణం, మైనర్ బాలికలతో సెక్స్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న ఎప్‌స్టీన్‌ను 2019లో అరెస్టు చేశారు. అదే ఏడాది ఆగస్టు 10న న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్‌లోని తన జైలు గదిలో అనుమానాస్పద స్థితిలో మరణిచాడు. జైలులో భద్రతా లోపాల కారణంగా ఆయన మరణంపై మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మరణించిన రాత్రి జైలు గది సమీపంలోని కెమెరాలు దీర్ఘకాలిక సాంకేతిక సమస్యల కారణంగా పనిచేయ లేదని 2023లో అమెరికా న్యాయశాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ నివేదిక కూడా మరిన్ని అనుమానాలను తావిచ్చింది. అలాగే మరణానికి కొన్ని వారాల ముందు ఆయనను 'సూసైడ్ వాచ్' లో ఉంచారు, కానీ 2019 జూలై 24న దానిని తొలగించారు. ఒక మనస్తత్వవేత్త నివేదిక ప్రకారం అసలు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఏదీ తనకు లేదని ఎప్‌స్టీన్‌ చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: International Men’s Day 2026: పెళ్లే పురుషుడి జీవిత లక్ష్యమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement