67 ఏళ్ల వృద్ధురాలిపై అఘాయిత్యానికి యత్నం.. నోట్లో గుడ్డలు కుక్కి | 67Years Old Woman Incident | Sakshi
Sakshi News home page

67 ఏళ్ల వృద్ధురాలిపై అఘాయిత్యానికి యత్నం.. నోట్లో గుడ్డలు కుక్కి

Nov 18 2026 12:29 PM | Updated on Nov 18 2026 12:29 PM

 67Years Old Woman Incident

 ఖిలా వరంగల్‌: ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలికి అర్ధరాత్రి భయానక అనుభవం ఎదురైంది. ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి లైంగికదాడికి యత్నించాడు. భయంతో జరిగిన పెనుగులాటతో ఇంట్లో పాత్రలు, ఇతర వస్తువులు కిందపడడగా ఆ శబ్దాలతో భయపడిన దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడని తెలుస్తోంది. వరంగల్‌లోని ఓ కాలనీలో 67 ఏళ్ల వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. 

సోమవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తలుపు తట్టాడు. ఆమె తీయకపోవడంతో ఇంటి వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించి వృద్ధు్దరాలి నోట్లో గుడ్డలు కుక్కి లైంగికదాడికి యత్నించినట్లు సమాచారం. నిందితుడితో జరిగిన పెనుగులాటలో ఇంట్లోని పాత్రలు, ఇతర వస్తువులు పడడంతో పెద్ద శబ్దాలు వచ్చాయని, దీంతో ఎవరైనా వస్తారనే భయంతో దుండగుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. 

యువకులు గంజాయి మత్తులో సంచరిస్తున్నారని, వారిలో ఎవరైనా ఈదారుణానికి యత్నించి ఉంటారనే అనుమానాలను స్థానికులు వ్యక్త పరిచినట్లు తెలుస్తోంది.  నిందితుడి వివరాలు, ఘటన వెనుక కారణాలు పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది.  ఘటన సమాచారం అందుకున్న సెంట్రల్‌జోన్‌ డీసీపీ దార కవిత, మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్‌ కర్రెస్వామి, క్లూస్‌ టీం సిబ్బంది, ఇతర విభాగాలకు చెందిన ఇన్‌స్పెక్టర్లు మంగళవారం ఘటనా స్థలిని సందర్శించారు. 

 బాధితురాలిని కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు ఫిర్యాదు చేయగా.. మిల్స్‌కాలనీ పోలీసులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది.  బాధిత వృద్ధురాలిని రక్షణ నిమిత్తం భరోసా కేంద్రానికి తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement