‘ఫ్లైదుబాయ్’లో పైలట్ మచ్చార్‌కు గాయమైంది ఇక్కడే.. | Pilot Smit Machchhars goes viral head injuries visible for first time | Sakshi
Sakshi News home page

‘ఫ్లైదుబాయ్’లో పైలట్ మచ్చార్‌కు గాయమైంది ఇక్కడే..

Oct 29 2026 8:29 AM | Updated on Oct 29 2026 8:41 AM

Pilot Smit Machchhars goes viral head injuries visible for first time

న్యూఢిల్లీ: ఇటీవల ‘ఫ్లైదుబాయ్’లో కాక్‌పిట్‌లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ తలపై గాయాలు, కుట్లు తొలిసారిగా బహిర్గతమయ్యాయి. ఆయన పుర్రెకు తీవ్ర గాయమైందని, ఎముక ముక్కలు మెదడు కణజాలం వైపు చొచ్చుకెళ్లాయని తెలుస్తున్నది. తలపై గాయాలతో పాటు చేతులు, కాళ్లు, ఛాతీ, పొత్తికడుపు పైభాగంలోనూ గాయాలయ్యాయి. సౌదీ అరేబియాలోని తబూక్‌లో విమానాన్ని అత్యవసరంగా దించిన వెంటనే ఆయనకు కొన్ని గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అబుదాబిలోని ప్రత్యేక వైద్య కేంద్రానికి తరలించారు.

తాజగా కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇచ్చిన ప్రత్యేక గౌరవానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ విమాన కాక్‌పిట్‌లో జరిగిన దాడి సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో పాటు విమాన సిబ్బందిని యూఏఈ అధ్యక్షుడు సత్కరించారు.
 

ఈ సందర్భంగా ఆయన పైలట్‌ను ఆప్యాయంగా పలకరించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ‘నాకో ఆలోచన వచ్చింది. నువ్వు కోలుకున్నాక మనం ఓ శిక్షణా సెషన్‌లో పాల్గొందాం. నీకు ఎలా పోరాడాలో నేర్పిస్తా’ అని యూఏఈ అధ్యక్షుడు సరదాగా అన్నారు. దీనికి స్మిత్ మచ్చర్ నవ్వుతూ స్పందిస్తూ.. ‘ఇది నాకు దక్కిన అతిపెద్ద గౌరవం’ అని చెప్పారు. ఈ సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి: ‘అణు కేంద్రం’లో అగ్నిప్రమాదం.. రేడియేషన్ లీక్ కలకలం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement