టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) తొలిసారిగా ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని కింద యాక్టివ్ వీఐ ప్రీపెయిడ్ యూజర్లు.. కంపెనీ యాప్‌ని ఉపయోగించి ఒక ప్రైమరీ మెంబర్, ముగ్గురు సెకండరీ మెంబర్లతో ఒక ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.
ప్రతి సభ్యుడు తమ సొంత ప్రీపెయిడ్ ప్లాన్, వేలిడిటీని కలిగి ఉంటూనే, అవసరమైనప్పుడు ఒకసారి 500 ఎంబీ డేటాను షేర్ చేసుకోవచ్చు. అలాగే వీఐ యాప్ ద్వారా చేసే ప్రతి రీచార్జ్‌పై కుటుంబసభ్యులందరూ 10 శాతం వరకు గ్యారెంటీ డిస్కౌంట్లను పొందవచ్చు.
ప్రీపెయిడ్ విభాగంలో సంప్రదాయ విధానాలకు భిన్నంగా ప్రజల కనెక్టివిటీ అవసరాలను తీర్చేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీశ్ ఖోస్లా తెలిపారు.
ఇదీ చదవండి: ఒక్క రూపాయి రీచార్జ్ ఆఫర్.. అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్!


