‘దోమలుకండి.. బొద్దింకలు కాదు’.. పోస్టర్ల హల్‌చల్‌! | Be a Machchar not a cockroach BJP youth wing erects billboard | Sakshi
Sakshi News home page

‘దోమలుకండి.. బొద్దింకలు కాదు’.. పోస్టర్ల హల్‌చల్‌!

Oct 6 2026 8:21 AM | Updated on Oct 6 2026 8:21 AM

Be a Machchar not a cockroach BJP youth wing erects billboard

పూణే: ఫ్లైదుబాయ్‌ విమానాన్ని ప్రమాదం నుంచి కాపాడిన భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ను అభినందిస్తూ పూణెలో ఏర్పాటు చేసిన పోస్టర్లు రాజకీయ వివాదానికి దారితీశాయి. ‘మచ్చర్‌ అవ్వండి.. కాక్రోచ్‌లు కాదు’ అంటూ బీజేపీ యువమోర్చా ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లు చర్చనీయాంశంగా మారాయి. పోస్టర్‌లోని ‘బొద్దింక’ పదం రాజకీయ ప్రత్యర్థులను, ఇటీవలి విద్యార్థి నిరసనలను ఉద్దేశించేలా ఉందంటూ విమర్శలు వచ్చాయి.

సెప్టెంబర్‌ 30న దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ FZ1073 విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సహ పైలట్‌ హమామ్‌ అల్‌ హమామీ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌పై దాడి చేయడంతో విమానం ఒక్కసారిగా కిందకు దిగిపోయింది. తీవ్ర గాయాలైనప్పటికీ మచ్చర్‌ కాక్‌పిట్‌ తలుపు తెరిచి సిబ్బందికి, ప్రయాణికులకు లోపలికి వచ్చే అవకాశం కల్పించారు. తరువాత విమానం సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయింది.
 

ఈ ఘటన తర్వాత కెప్టెన్‌ మచ్చర్‌ పేరును ఉపయోగిస్తూ పూణెలో పలు బ్యానర్లు కనిపించాయి. దానిలో ‘జీవితంలో అవకాశం లభించినపపుడు దోమలా మారండి.. బొద్దింకలా కాదు’ అనిరాసి ఉంది. బీజేపీ యువమోర్చా, పుణె పేరుతో ఈ పోస్టర్లు ఏర్పాటు చేశారు. మచ్చర్‌ ఇంటిపేరును ‘బొద్దింక’ పదంతో ముడిపెడుతూ చేసిన ఈ ప్రచారం సోషల్‌ మీడియాలో చర్చకు దారితీసింది. పోస్టర్‌లోని సందేశం కేవలం పైలట్‌ ధైర్యాన్ని ప్రశంసించడానికే పరిమితం కాలేదని విమర్శకులు అంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేలా ఈ పదజాలాన్ని ఉపయోగించారని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘మచ్చర్‌’ అంటే హిందీలో దోమ అని అర్థం.  

ఇదీ చదవండి: 10,500 ఏళ్ల కిందటే ఇళ్లు.. జర్మనీలో షాకిస్తున్న ఆధారాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement