పారిశ్రామిక దిగ్గజం హర్ష్ గోయెంక్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికపపుడూ ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయక విషయాలను పంచుకుంటుంటారు. అలానే తాజాగా మరో ఆసక్తికరమైన వీడియోతో ముందుకు వచ్చారు. అది తండ్రి కూతుళ్లకు సంబంధించిన వీడియో అది. తల్లిదండ్రులకు ఇంతకు మించి కావాల్సింది ఏమంది అంటూ హర్ష్ గోయెంకా తన అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు పోస్ట్‌లో. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
ఒక సౌత్ వెస్ ఎయిర్‌లైన్స్ పైలట్ ఒకరు విమాన ప్రయాణానికి ముందు ప్రయాణికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కనిపిస్తారు వీడియోలో. ఆయన తనకు ఈ రోజు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనదని చెబుతూ తన ఎయిర్‌లైన్ పైలట్ బృందంలో కొత్తగా చేరిన సభ్యురాలిని పరిచయం చేస్తారు. ఆమె ఇప్పుడే తన శిక్షణను పూర్తి చేసుకుందని చెబుతూ..సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో విమానాన్ని నడపడం ఆమెకు ఇదే తొలిరోజు అని వివరిస్తారు.
ఆ తర్వాత ఆ పైలట్ ప్రయాణికులతో ఇలా అంటారు. ఆమె ఎవరో కాదు తన ప్రాణమైన కుమార్తె అని గర్వంగా చెబుతారు. అంతేగాదు ఈ ప్రత్యేక సందర్భాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తన సంభాషణను ముగించారు. ఈ ప్రకటన కొత్తగా ఆ పైలట్ విమానాయన సంస్థలోకి చేరడం గురించే కాదు, ఒక తండ్రి తన కూతురితో ఒక ముఖ్యమైన మైలురాయిని పంచుకోవడం గురించి కూడా.
నిజంగా ఆ సందర్భం ఆ పైలట్ తండ్రికి గర్వించే క్షణం కదూ అంటూ హర్ష్ గోయెంకా ఆ సంభాషణలో చివరి వాక్యం నాకు బాగా నచ్చింది అని క్యాప్షన్ జోడించి మరి ఈ వీడియోని పంచుకున్నారు. నెటిజన్లు కూడా ఒక తండ్రికి ఇంతకంటే గర్వించదగిన క్షణం మరొకటి ఉండదు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
Loved the last line 🥰 https://t.co/OQ4GQn4sTm
— Harsh Goenka (@hvgoenka) October 12, 2026
ఇదీ చదవండి: ఫ్యాషనే ఆయుధంగా.. స్టైల్‌గా నిరసన! నేహా బోరా వన్ పీస్ టీ షర్టు దుమారం..


