ఇండియాలో పైలట్ జీతాలు ఎంతో తెలుసా? | How Much Does a Pilot Earn in India and Check the Salary Details | Sakshi
Sakshi News home page

ఇండియాలో పైలట్ జీతాలు ఎంతో తెలుసా?

Oct 3 2026 3:00 PM | Updated on Oct 3 2026 3:31 PM

How Much Does a Pilot Earn in India and Check the Salary Details

చాలామంది యువత ఆకాశంలో విమానం నడపాలని కలలు కంటుంటారు. ఎందుకంటే.. పైలట్ ఉద్యోగం గౌరవప్రదమైన జాబ్ మాత్రమే కాకుండా, మంచి కెరీర్ అవకాశాలను కూడా అందిస్తుంది. అయితే.. భారతదేశంలో పైలట్ కావాలనుకునే వారికి ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి సివిల్ ఏవియేషన్ ద్వారా కమర్షియల్ పైలట్ అవ్వడం. మరొకటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరి పైలట్ అవ్వడం.

ఈ రెండు మార్గాలు ఒకదానికొకటి కొంచెం భిన్నంగా ఉంటాయి. అందుకే.. ముందుగా ఈ ఉద్యోగం గురించి పూర్తిగా తెలుసుకుని, మనకు ఏ మార్గం సరిపోతుందో నిర్ణయించుకోవాలి.

కమర్షియల్ పైలట్
కమర్షియల్ పైలట్ అంటే.. సాధారణంగా ఎయిర్‌లైన్ కంపెనీల్లో విమానాలను నడిపే పైలట్. వీరు ప్రయాణికులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్తారు. కొంతమంది పైలట్స్ కార్గో విమానాలను కూడా నడుపుతారు. కమర్షియల్ పైలట్ కావాలంటే సాధారణంగా 12వ తరగతిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. ఆ తర్వాత పైలట్ ట్రైనింగ్ స్కూల్‌లో చేరి విమానం నడపడం గురించి శిక్షణ తీసుకోవాలి.

ఇండియాలో సివిల్ ఏవియేషన్ పైలట్లకు లైసెన్స్ ఇచ్చే సంస్థ డీజీసీఏ(Directorate General of Civil Aviation). పైలట్ కావడానికి నిర్ణీత ఫ్లయింగ్ గంటలు పూర్తి చేయడంతో పాటు, అవసరమైన రాత, ఇతర పరీక్షలను కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మెడికల్ టెస్టుల్లో కూడా అర్హత సాధించాలి. అనుభవం పెరిగే కొద్దీ.. పైలట్ వివిధ ఉన్నత స్థానాలకు ఎదగవచ్చు. మొదట ఫస్ట్ ఆఫీసర్‌గా పని చేసి, తర్వాత అనుభవం వచ్చినప్పుడు కెప్టెన్‌గా ఎదిగే అవకాశం ఉంటుంది.

ఎయిర్ ఫోర్స్ పైలట్
పైలట్ అవ్వడానికి మరో మార్గం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరడం. ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా విమానాలను నడపడమే కాకుండా దేశ రక్షణకు సంబంధించిన విధుల్లో కూడా పాల్గొనాలి.

ఈ మార్గంలో సాధారణ ఎయిర్‌లైన్ పైలట్ కంటే ఎంపిక ప్రక్రియ, శిక్షణ, వైద్య ప్రమాణాలు వేరుగా ఉంటాయి. రాత పరీక్షలు, శారీరక పరీక్షలు, వైద్య పరీక్షలు, ఇతర ఎంపిక ప్రక్రియలను పూర్తి చేయాలి. ఎయిర్ ఫోర్స్ పైలట్ ఉద్యోగంలో.. క్రమశిక్షణ చాలా ముఖ్యం. విమానాలను నడపడంతో పాటు దేశ భద్రతకు సంబంధించిన బాధ్యతలను కూడా నిర్వహించాల్సి ఉంటుంది.

పైలట్ జీతం
పైలట్ జీతం అందరికీ ఒకేలా ఉండదు. వారు పనిచేసే కంపెనీ, వారి అనుభవం, హోదా, ఫ్లయింగ్ గంటలను బట్టి జీతం మారుతుంది.

ఉదాహరణకు, కొన్ని అంచనాల ప్రకారం.. ఎయిర్ ఇండియాలో ప్రారంభ స్థాయి పైలట్‌కు నెలకు సుమారు రూ.1.67 లక్షలు ఉండవచ్చు. అనుభవం పెరిగిన తర్వాత కొన్ని స్థాయిల్లో నెలకు రూ.5.56 లక్షలు వరకు ఆదాయం ఉండవచ్చని చెబుతారు.

ఎయిర్ ఫోర్స్‌లో కూడా జీతం హోదా, అనుభవాన్ని బట్టి మారుతుంది. సీనియర్ స్థాయిలో సంవత్సరానికి సుమారు రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆదాయం ఉండవచ్చని సమాచారం. మరోవైపు కమర్షియల్ ఎయిర్‌లైన్స్‌లో అనుభవం ఉన్న సీనియర్ కెప్టెన్లు సంవత్సరానికి చాలా ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: ఇదే జరిగితే.. బంగారం రూ.3 లక్షలకు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement