ఇదే జరిగితే.. బంగారం రూ.3 లక్షలకు! | Is Gold at Rs 3 Lakh and What Could Trigger the Next Big Rally | Sakshi
Sakshi News home page

ఇదే జరిగితే.. బంగారం రూ.3 లక్షలకు!

Oct 2 2026 5:10 PM | Updated on Oct 2 2026 5:52 PM

Is Gold at Rs 3 Lakh and What Could Trigger the Next Big Rally

బంగారం ధరలు భారతదేశంలో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1.50 లక్షల మార్క్‌ను దాటింది. ఈ నేపథ్యంలో.. 2027 నాటికి పసిడి ధరలు మరింత భారీగా పెరుగుతాయంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం వైరల్ అవుతోంది.

ఈ ప్రచారానికి బల్గేరియాకు చెందిన ప్రముఖ భవిష్యవేత్త బాబా వంగా పేరు జోడించడంతో దీనిపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి, వాస్తవ ఆర్థిక అంచనాలకు మధ్య తేడా ఉందని గుర్తించాల్సిన అవసరం ఉంది.

పసిడి ధరలు 40 శాతం
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, నగదు కొరత లేదా బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం తగ్గే పరిస్థితులు ఏర్పడితే పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని కొంతమంది. దీంతో పసిడి ధరలు మరో 25 నుంచి 40 శాతం వరకు పెరగవచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే జరిగితే.. భారత్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.మూడు లక్షల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

నిజానికి.. బాబా వంగా బంగారం ధరలు 2027లో భారీగా చేరుతాయని చెప్పినట్లు నిర్ధారించే ఆధారాలు అందుబాటులో లేవు. కానీ.. ఈమె చెప్పినట్లు, బంగారం భారీగా పెరుగుతుందని అప్పుడప్పుడు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.

ఆర్థిక సంస్థలు ఇలా..
బాబా వంగా పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని పక్కన పెడితే.. కొన్ని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు మాత్రం భవిష్యత్తులో బంగారం ధరలు పెరిగే అవకాశంపై తమ అంచనాలను వెల్లడించాయి.

జేపీ మోర్గాన్ ప్రకారం.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం వంటి అంశాల నేపథ్యంలో.. ఔన్సు బంగారం ధర 2026 చివరి నాటికి 6,000 డాలర్లకు, 2027 నాటికి 6,300 డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా. అదేవిధంగా యూబీఎస్ కూడా 2027 తొలి అర్ధభాగంలో ఔన్సు బంగారం ధర 5,000 డాలర్ల స్థాయిని తాకవచ్చని విశ్లేషించినట్లు పేర్కొంది

బంగారం ధరలు మార్కెట్ పరిస్థితులు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, డాలర్ విలువ, భౌగోళిక రాజకీయ పరిణామాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి కాలానుగుణంగా ఈ అంచనాలు మారే అవకాశం ఉంటుంది.

బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయి
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో.. అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సాధారణంగా సురక్షితమైన ఆస్తుల వైపు చూస్తారు. బంగారాన్ని కూడా అలాంటి ఆస్తుల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఆర్థిక సంక్షోభాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లేదా ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల్లో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, అంతర్జాతీయ వడ్డీ రేట్లు, డాలర్ విలువ, పెట్టుబడిదారుల డిమాండ్ వంటి అంశాలు కూడా పసిడి ధరలను గణనీయంగా ప్రభావితం చేయనున్నాయి.

ఇదీ చదవండి: బంగారం అలారం బెల్‌.. కియోసాకి హెచ్చరిక!

దేశంలో రోజు బంగారం ధరలు ఇలా
ఈ రోజు భారతదేశంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. పసిడి రేట్లు దేశంలోని ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయో కింద చూడండి.

దేశంలో రోజు బంగారం ధరలు ఇలా1
1/4

దేశంలో రోజు బంగారం ధరలు ఇలా2
2/4

దేశంలో రోజు బంగారం ధరలు ఇలా3
3/4

దేశంలో రోజు బంగారం ధరలు ఇలా4
4/4

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement