విద్యార్థులకు ఉచితంగా ‘జోహో క్యాటలిస్ట్’ | Zoho Built Its Own Cloud Catalyst Now FREE for Students | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ఉచితంగా ‘జోహో క్యాటలిస్ట్’

Oct 3 2026 1:11 PM | Updated on Oct 3 2026 1:16 PM

Zoho Built Its Own Cloud Catalyst Now FREE for Students

ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ జోహో విద్యార్థుల కోసం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. తమ స్వదేశీ సర్వర్‌లెస్ ప్లాట్‌ఫామ్ ‘క్యాటలిస్ట్’ సేవలను విద్యార్థులకు పూర్తి ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు వెల్లడించారు. క్లౌడ్ ఇన్‌ఫ్రా వ్యయాల భయం లేకుండా యువ డెవలపర్లు రియల్-టైమ్ అప్లికేషన్లను అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొన్నారు.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్‌) లేదా గూగుల్ క్లౌడ్ వంటి విదేశీ దిగ్గజాలపై ఆధారపడకుండా జోహో ఆరంభంలోనే సొంత క్లౌడ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించుకుంది. డేటాబేస్‌లు, ఐడెంటిటీ, మెసేజింగ్, సెర్చ్, స్టోరేజ్, కంప్యూట్ వ్యవస్థలను సొంతంగా రూపొందించుకుంది. ఈ అంతర్గత సాంకేతికత ఆధారంగానే ‘క్యాటలిస్ట్’ ప్లాట్‌‌ఫామ్ రూపుదిద్దుకుంది. ప్రారంభంలో జోహో ఉత్పత్తుల విస్తరణ కోసం రూపొందించిన ఈ సర్వర్‌లెస్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు ఇతర డెవలపర్ల ఆదరణను కూడా పొందుతోంది.

‘మనం మన సొంత క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించుకున్నాం. విద్యార్థులు తమ ఆలోచనలను నిజమైన ఉత్పత్తులుగా మార్చడానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించడమే మా ముఖ్య లక్ష్యం’ అని శ్రీధర్ వెంబు అన్నారు. విద్యార్థులకు ఉచితంగా సాంకేతికతను అందించడం ద్వారా భారతదేశంలో ఆవిష్కరణల వేగం పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మౌలిక వసతుల ఖర్చులు లేకుండా కోడింగ్, ప్రోగ్రామింగ్ నేర్చుకునే వారికి జోహో నిర్ణయం మెరుగైన అవకాశంగా మారనుంది.

ఇదీ చదవండి: నేలవాలిన అపరంజి ధరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement