‘జైల్లో పెట్టినంత మాత్రాన వైఎస్సార్‌సీపీ వెనకడుగు వేసే పార్టీ కాదు’ | YSRCP is not a party that will take a step back just because its members are put in jail | Sakshi
Sakshi News home page

‘జైల్లో పెట్టినంత మాత్రాన వైఎస్సార్‌సీపీ వెనకడుగు వేసే పార్టీ కాదు’

Nov 18 2026 9:39 PM | Updated on Nov 18 2026 9:40 PM

తూర్పుగోదావరి జిల్లా: మాజీ మంత్రులు కన్నబాబు, వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బుధవారం ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్‌లో కలిశారు. అనంతరం ముగ్గురు నేతలు మీడియాతో మాట్లాడారు.

మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ‘‘అక్రమ కేసులు బనాయించి వైఎస్సార్‌సీపీ నేతలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఏ తప్పు చేయకపోయినా అప్పిరెడ్డిని అరెస్టు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పలుమార్లు అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్ నిలదీశారు. ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టినంత మాత్రాన వైఎస్సార్‌సీపీ వెనకడుగు వేసే పార్టీ కాదు’’ అని మండిపడ్డారు.

మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో దారుణమైన పాలన కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో బాధితులే నిందితులవుతున్నారు. పార్టీలో చురుగ్గా ఉండే నాయకులను నిజాన్ని నిర్భయంగా నిలదీస్తే నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వం అరెస్టు చేయిస్తోంది. ప్రజలంతా గమనిస్తున్నారు. కచ్చితంగా కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అని ధ్వజమెత్తారు.

మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో అడుగడుగునా అక్రమాలకు కూటమి ప్రభుత్వం తెరతీసింది. నామినేషన్ల నుంచి ఫలితాలు వరకు విస్తృతంగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. నాయకులను అరెస్టు చేసినంత మాత్రాన వైఎస్సార్‌సీపీ బెదిరే ప్రసక్తే లేదు. అప్పిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement