సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఓ కస్టమర్ బరితెగించి ప్రవర్తించారు. ఫుడ్ డెలివరీ ఆలస్యమయ్యిందని సదరు డెలివరి బాయ్‌పై ఏకంగా దాడికి దిగాడు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఓ భార్యభర్తలు ఫుడ్ డెలివరీకి ఆర్డర్ ఇచ్చారు. అయితే ఆ సమయంలో లొకేషన్ తప్పుగా పెట్టారు. దీంతో ఆ డెలివరీ ఆలస్యమయ్యింది.
దీంతో ఆగ్రహం చెందిన భార్యభర్తలు ఫుడ్ డెలివరీ ఆలస్యమయ్యిందని సదరు డెలివరీ బాయితో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా అతనిపై దాడి చేశారు. ఈ చిత్రాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.


