తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల | Telangana 2027 Inter Exam Dates Announced | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Nov 19 2026 7:08 PM | Updated on Nov 19 2026 7:14 PM

Telangana 2027 Inter Exam Dates Announced

సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) 2027 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు సంబంధించిన థియరీ పరీక్షలతో పాటు ప్రాక్టికల్స్, ఇంటర్నల్ అసెస్‌మెంట్, ఇతర పరీక్షల తేదీలను బోర్డు ప్రకటించింది. 2027 ఫిబ్రవరి 24 నుండి మార్చి 20 వరకు థియరీ పరీక్షలు జరగనున్నాయి.  

ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 24న ప్రారంభమై మార్చి 19న ముగుస్తాయి. సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 25న మొదలై మార్చి 20న పూర్తవుతాయి. ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. జనరల్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు ఈ షెడ్యూల్ వర్తిస్తుండగా, ఒకేషనల్ సబ్జెక్టుల వారీ టైమ్‌టేబుల్‌ను వేరుగా విడుదల చేస్తామని బోర్డు తెలిపింది.  

థియరీ పరీక్షలకు ముందే ప్రాక్టికల్ పరీక్షలను పూర్తి చేసేలా బోర్డు తేదీలను ఖరారు చేసింది. సెకండియర్ ప్రాక్టికల్స్‌ను 2027 ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 10 వరకు, ఫస్టియర్ సైన్స్ ప్రాక్టికల్స్‌ను ఫిబ్రవరి 10/11 నుండి ఫిబ్రవరి 18 వరకు నిర్వహించనున్నారు. ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలను ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 29న, సెకండియర్ విద్యార్థులకు జనవరి 30న నిర్వహిస్తారు.  

ఫస్టియర్ ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ను 2027 జనవరి 20 నుండి జనవరి 25 వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 27న, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జనవరి 29న జరుగుతాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement