హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్‌ను కాంగ్రెస్ వాళ్లే పేల్చేశారంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. మూడేళ్ల నుంచి 2 పిల్లర్లను రిపేర్ చేయలేకపోతున్నారని, అసలు మేడిగడ్డ ప్రాజెక్టు కొట్టుకుపోవాలన్నది రేవంత్ కోరిక అని ఆయన మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్‌ను రిపేర్లు చేయకుండా అట్లానే ఉంచారంటే దీనిని ఏమనుకోవాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది కక్ష పూరిత ధోరణి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు(గురువారం, నవంబర్ 19వ తేదీ) తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ ప్రసంగించారు. పలువురు కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, రెన్యువల్ సీఎం అంటూ విమర్శించారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వంలో పర్సంటేజ్ లేనిదే ఏ పని జరగడం లేదని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చెబుతున్నారు. ఢిల్లీకి కాంగ్రెస్, బీజేపీ నేతలు బానిసల్లా మారిపోయారు. రాహుల్‌కు, సోనియాగాంధీకి రేవంత్ బాడీగార్డ్‌లా మారిపోయారు. ఫించన్ల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతుంది. కొత్త పెన్షన్లపై కాంగ్రెస్ డ్రామాలాడుతోంది. మూడేళ్లలో 4.70 లక్షల ఫించన్ల తొలగించారు’ అని విమర్శించారు.
ఇదీ చదవండి: కోమటిరెడ్డి వ్యాఖ్యల ఎఫెక్ట్.. రేవంత్‌కు రాజాసింగ్ సవాల్


