హైదరాబాద్: ఎండి పోయిన చెట్టు రూపంలో మృత్యువు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందగా.. బంధువుల అబ్బాయి తీవ్రంగా గాయపడ్డాడు. నాగోలు పోలీసులు తెలిపిన మేరకు.. ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోల్‌కు చెందిన వి. సాయికుమార్(29) నాగోలు బండ్లగూడ శ్రీ వెంకటేశ్వర కాలనీలో ఇందు అరణ్యలో నివాసం ఉంటూ ఇన్ఫోసిస్‌లో సాప్‌్టవేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
బుధవారం గ్యాస్‌బుక్ చేసేందుకు ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఉన్న గ్యాస్ గోదాం దగ్గరకు ద్విచక్ర వాహనం పై అతని బంధువుల అబ్బాయి సత్య ఫణీంద్రతో కలిసి వెళ్తున్నాడు. కుంట్లూరు రాజీవ్ గృహకల్ప కాలనీ దగ్గర రోడ్డుపై ఉన్న చెట్టు అకస్మాత్తుగా కూలి సాయికుమార్‌పై పడిపోయింది. దీంతో తీవ్ర గాయలతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఫణీంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు వెంటనే చెట్టును తొలగించగా అప్పటికే సాయికుమార్‌కు మృతి చెందాడు. నెల రోజుల క్రితమే ఇతనికి వివాహైంది. ఇదిలా ఉండగా జర్మనీలోఉద్యోగం రావడంతో మరో నెలరోజుల్లో అక్కడికి సాయికుమార్ వెళ్లాల్సి ఉంది. హెల్మెట్ ధరించి ఉంటే బతికి ఉండేవాడని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. చెట్లు ఎండిపోయికూలేందుకు సిద్ధంగా ఉండడాన్ని స్థానికులు గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు.


