హైదరాబాద్: అంబర్‌పేటలోని ఓ హోటల్‌లో మండీ బిర్యాని తిన్న ఓ కుటుంబంలోని తొమ్మది మంది ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురై ఆలస్యంగా నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి వచ్చారు. అంబర్‌పేటలో నివాసం ఉండే ఓ కుటుంబం ఈ నెల 15న గాంధీ»ొమ్మ సమీపంలోని ఓ బిర్యానీ హోటల్‌లో మండీ బిర్యాని తెప్పించుకుని బంధువులతో కలిసి తిన్నారు. కొద్దిసేపటికి వారిలో తొమ్మిది మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హోటల్ యజమానిని నిలదీయడంతో స్థానికంగా ఓ ఆసుపత్రిలో వారికి చికిత్సలు చేయించారు.
కాగా అస్వస్థతకు గురైన వారిలో ఓ మహిళకు న్యూరో సమస్య తలెత్తి పరిస్థితి విషమించింది. దీంతో అస్వస్థతకు గురైన వారందర్నీ మెరుగైన చికిత్సల కోసం బుధవారం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. వీరిలో ఐదుగురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఫీవర్‌లో ఏడేళ్లలోపు పిల్లలకు చికిత్సలు చేయరు. అలాగే అస్వస్థతకు గురైన వారి వద్ద ఉన్న ప్రైవేట్ ఆసుపత్రి రిపోర్టులో ఓ మహిళకు న్యూరో సమస్య ఉందని పేర్కొనడంతో మెరుగైన చికిత్సల కోసం అందరినీ ఉస్మానియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఫుడ్ పాయిజన్‌కు గురైన వారిలో సయ్యద్ నసీమ్ సుల్తానా, ఖతీజ తుల్ కుబ్రా, ఆస్మా సుల్తాన, కాచిగూడ నెహ్రూనగర్‌కు చెందిన మహ్మద్ ఆమీర్ ఉన్నారు.


