టీడీపీని వదిలి.. వైఎస్సార్‌ సీపీలో చేరి | Big Shock To Chandrababu TDP Families Join YSRCP | Sakshi
Sakshi News home page

టీడీపీని వదిలి.. వైఎస్సార్‌ సీపీలో చేరి

Nov 19 2026 11:45 AM | Updated on Nov 19 2026 11:48 AM

 Big Shock To Chandrababu TDP Families Join YSRCP

పోతవరంలో పసుమర్తి కృష్ణ, భాగ్యశ్రీలను వైఎస్సార్‌ సీపీలోకి ఆహ్వనిస్తున్న తానేటి వనిత

రాజమహేంద్రవరం రూరల్‌: రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శిష్యుడు సింహ శివ రామకృష్ణ, ఆయన తల్లి మాజీ కార్పొరేటర్‌ సింహ నాగమణి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ సీపీలో చేరారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్, పార్టీ రాష్ట్రకార్యదర్శి గొందేశి శ్రీనివాసులురెడ్డిల సమక్షంలో తమ అనుచరులతో కలిసి వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి పార్టీ నేతలు కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. 

సింహ రామకృష్ణ మాట్లాడుతా 30 ఏళ్లకు నిబద్ధతతో పార్టీ కోసం పనిచేశామని, గోరంట్లకు ఎంతో సేవ చేశామన్నారు. ఎన్నికల్లో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నిలబడి పనిచేసి గెలిపిస్తే, అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తల మొహం చూడటానికి కూడా ఆయన ఇష్టపడటం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక కార్యకర్తల పడిన కష్టానికి గుర్తింపు ఇవ్వకపోగా, కనీసం కార్యకర్తకు విలువ కూడా ఇవ్వడం లేదన్నారు. జెండా మోసిన కార్యకర్తతో మాట్లాడటానికి కూడా ఆయనకు సమయం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో మనసు చంపుకొని టీడీపీలో కొనసాగాలేమన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన అనేక సంక్షేమ పథకాల ద్వారా చాలా మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. కార్యకర్తకు అండగా ఉంటూ విలువ నిచ్చే వైఎస్సార్‌ సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

పోతవరంలో టీడీపీకి షాక్‌
దేవరపల్లి: గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్‌ తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు వైఎస్సార్‌ సీపీకి మద్దతు తెలుపుతున్నారు. మాజీ హోం మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ఆధ్వర్యంలో వారందరూ వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారు. ఈ మేరకు నల్లజర్ల మండలం పోతవరంలో టీడీపీ నాయకులు పసుమర్తి కృష్ణ, పసుమర్తి భాగ్యశ్రీ, మరో 50 మంది అనుచరులు మంగళవారం రాత్రి వైఎస్సార్‌ సీపీలో చేరారు.

 వీరికి తానేటి వనిత పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పసుమర్తి భాగ్యశ్రీని గ్రామ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా తానేటి వనిత ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం, గ్రామ కమిటీ అధ్యక్షులు కానూరి ప్రసాద్, పెండ్యాల వీరరాఘవులు, పెండ్యాల హరేరామకృష్ణ, పాపా నాగు, ఎంపీటీసీ సభ్యురాలు ఏలేటి భాగ్యలక్ష్మి, శేషగిరి, అబ్బూరి రాజయ్య, మాజీ సర్పంచ్‌ నూతుకుర్తి లక్ష్మణరావు, నూతకుర్తి రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు చిడిపి చింతయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

కేశవరంలో 50 మంది.. 
కపిలేశ్వరపురం(మండపేట): కేశవరం గ్రామానికి చెందిన 50 మంది మంగళవారం రాత్రి వైఎస్సార్‌ సీపీలో చేరారు. గ్రామానికి చెందిన కడగల దుర్గాప్రసాద్, బన్నీ, రవికుమార్, ఉదయ్‌ రాజు, సతీష్ , దుర్గా ప్రసాద్, సాయి హర్ష, తులసీ దుర్గా ప్రసాద్, శ్రీచరణ్, హేమంత్, మణికంఠ, రాజేష్, రమేష్‌ తదతర యువకులు సమావేశమై గ్రామాభివృద్ధి వైఎస్సార్‌ సీపీ ద్వారానే సాధ్యమని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్నబాబు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీశ్రీ, వెంకన్నబాబు పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. వెంకన్నబాబు మాట్లాడుతూ సామాన్య ప్రజల అభ్యున్నతి కోసం పని చేయాలనుకునే వారికి వైఎస్సార్‌ సీపీ సరైన వేదిక అన్నారు. కార్యక్రమంలో నాయకులు తుపాకుల ప్రసన్నకుమార్, గంధం సూరిబాబు, విన్నకోట ప్రసాద్, కొల్లి శేఖర్, బి.అప్పారావు పాల్గొన్నారు.  

ఇదీ చదవండి: జనసేన కోసం నా భర్తను వదులుకున్నా.. మహిళ ఆవేదన

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement