పల్నాడులో నామినేషన్లు.. హైకోర్టు కీలక ఆదేశాలు | AP High Court Key Order To SP Over Palnadu Elections | Sakshi
Sakshi News home page

పల్నాడులో నామినేషన్లు.. హైకోర్టు కీలక ఆదేశాలు

Nov 19 2026 10:37 AM | Updated on Nov 19 2026 10:37 AM

AP High Court Key Order To SP Over Palnadu Elections

సాక్షి, పల్నాడు: ఏపీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో పల్నాడు జిల్లాలో నెలకొన్న వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారంటూ పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఎస్పీకి హైకోర్టు ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చింది.

ఎన్నికల నేపథ్యంల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకోవడంపై మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో 64 మంది సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన హైకోర్టు.. పల్నాడు జిల్లా ఎస్పీకి కీలక ఆదేశాలు ఇచ్చింది. కోర్టును ఆశ్రయించిన 64 మంది అభ్యర్థులకు పోలీసు భద్రత కల్పించి, వారు ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కడపలోనూ భద్రతకు ఆదేశాలు.. 
అంతకుముందు.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), కడప జిల్లా ఎస్పీకి  హైకోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది. నామినేషన్లకు ఎటువంటి విఘా­తం కలగకూడదని స్పష్టంచేసింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సమర్పించిన వినతి పత్రాలను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలను విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.

ఇటీవల జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల తరహాలోనే.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ, దాడులకు పాల్పడుతూ అరాచకం సృష్టిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు పెద్ద సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్సార్‌ కడప జిల్లా, పులివెందుల, చక్రాయపేట, లింగాల, వేల్పుల, తొండూరు మండలాల పరిధిలోని 21 గ్రామాలకు చెందిన పలువురు అభ్యర్థులు హైకోర్టులో బుధవారం అత్యవసరంగా పలు వ్యాజ్యాలు దాఖలు చేశారు.  

పిటిషనర్ల తరఫు న్యాయవాది తప్పుట నాగార్జునరెడ్డి వాదనలు వినిపిస్తూ..‘నామినేషన్ల దాఖలు సందర్భంగా తగిన భద్రత కల్పించాలని అభ్యర్థిస్తూ ఎన్నికల సంఘానికి, జిల్లా ఎస్పీకి పిటిషనర్లు వినతి పత్రాలు ఇచ్చారు. అయితే వీటిపై ఎటువంటి స్పందనా లేదు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు హింసకు, బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. పోటీ చేసే అభ్యర్థులను, వారి అనుచరులను భయభ్రాంతులకు గురిచేయడం, నామినేషన్‌ కేంద్రాల వద్ద అలజడి సృష్టించడం ద్వారా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడానికి బయటి ప్రాంతాల నుంచికొంతమంది వ్యక్తులను పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి తరలించారు. అక్రమాలతో ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ నేతలు కుట్రలు పన్ను­తు­న్నారు’ అని విన్నవించారు.

ఇదీ చదవండి: కూటమి సర్కార్‌ విధ్వంసంపై ఎన్‌జీటీ సీరియస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement