సాక్షి, నంద్యాల జిల్లా: వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి దౌర్జన్యకాండ కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ నేత బైరెడ్డి సిద్దార్థ్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నందికొట్కూరు నియోజకవర్గానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పాముల పాడు ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ కుట్ర రాజకీయాలకు తెరలేపింది. ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి కుట్రలు చేస్తోందని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి మండిపడ్డారు.
‘‘టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాతీర్పుతో గెలిచాం. కూటమి నేతలకు ఎన్నికల్లో గెలవడం చేతకాక పోలీసులను అడ్డుపెట్టుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు పెడతారో పెట్టండి. మా ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోండి’’ అంటూ బైరెడ్డి హెచ్చరించారు. మా అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించి వేశారు.. పోలింగ్‌ను సజావుగా జరుగకుండా అడ్డుకున్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని బెదిరింపు పాల్పడిన ప్రజా తీర్పులో మేము గెలిచాం. గెలిచిన కూడా నేడు ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ నేతలు పోలీసులతో అడ్డుకుంటున్నారు’’ అంటూ బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: దిశ మార్చుకున్న అక్వాన్..


