జనసేన కోసం నా భర్తను వదులుకున్నా.. మహిళ ఆవేదన | Janasena Veeramahila Bodapati Maria Emotional Appeal | Sakshi
Sakshi News home page

జనసేన కోసం నా భర్తను వదులుకున్నా.. మహిళ ఆవేదన

Nov 19 2026 11:22 AM | Updated on Nov 19 2026 11:27 AM

Janasena Veeramahila Bodapati Maria Emotional Appeal

ఎంపీ ఇంటి వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న మరియా

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘జనసేన పార్టీ కోసం నా జీవితాన్నే పణంగా పెట్టాను. నా భర్తను వదులుకున్నాను. నా బిడ్డను వికలాంగుడిని చేసుకున్నాను. అయినా నాకు గుర్తింపు ఇవ్వరా? దళిత మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా?’ అంటూ 30వ వార్డుకు చెందిన జనసేన వీరమహిళ బోడపాటి మరియా ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 30వ డివిజన్‌ కార్పొరేటర్‌ సీటు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ ఇంటి వద్ద ఆమె ఆందోళన చేశారు. 

పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు. జనసేన ఆవిర్భావం నుంచీ పారీ్టలో కొనసాగుతున్నా.. దళిత మహిళననే ఉద్దేశంతోనే స్థానిక నాయకులు తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలు పవన్‌ కల్యాణ్‌కు చెప్పుకోవాలా? నాయకులకు చెప్పుకోవాలా అంటూ కన్నీరు పెట్టుకున్నారు. పార్టీ జెండా మోసిన తనను పక్కన పెడతారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘దళితురాలిని కాబట్టే నాకు సీటు ఇవ్వరా? ఒక్క నేత కూడా నాకు సపోర్ట్‌ చేయరా?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఇంత గోడు పెట్టుకుంటున్నా అక్కడున్న ఒక్క జనసేన నేత కూడా స్పందించలేదు. దీనినిబట్టి చూస్తే జనసేనలో దళితులకు దక్కుతున్న ప్రాధాన్యం ఎంతో అర్థమవుతోంది.

ఇదీ చదవండి: మమ్మల్ని బిచ్చగాళ్లుగా చూస్తారా?


 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement