సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ నటీ జాన్వీకపూర్ మార్ఫింగ్ వీడియోపై హైదరాబాద్ పోలీసులు సీరియసయ్యారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో వ్యవహారంపై కేసు నమోదు చేశారు. ఇటువంటి పనులు చేస్తే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘చుట్టమల్లే’(దేవర సినిమా) పాట సెగ కనిపిస్తోంది. ఏఐ ద్వారా అత్యంత నీచంగా ఎడిట్ చేసిన ఈ వీడియోని కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనిపై ఎన్టీఆర్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ స్పందించారు.
చుట్టమల్లే పాటను ఏఐ టెక్నాలజీతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడంపై హీరోయిన్ జాన్వీ కపూర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి నకిలీ వీడియోలను క్రియేట్ చేయడం, షేర్ చేయడం ఏఐ దుర్వినియోగమేనని తెలిపారు.ఇలాంటి చేష్టలకు పాల్పడిన వారిపై తప్పకుండా తీవ్రమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆమె గట్టిగా హెచ్చరించారు. ఈమేరకు ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
కాగా ఇప్పటికే ఈ ఏఐ వీడియోపై మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇప్పుడు ఈ వివాదం పై హీరోయిన్ జాన్వీ కపూర్ సైతం స్పందించింది. ఏఐ టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం కలవరపాటుకు గురిచేస్తోందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారద్నెఫై
ఫైరవుతున్న నెటిజన్లు
ఇలాంటి చర్యల వల్ల సెలబ్రిటీల వ్యక్తిగత ప్రతిష్ట, గౌరవానికి తీవ్ర భంగం వాటిల్లుతోందని అభిమానులు మండిపడుతున్నారు. క్రియేటివిటీ పేరుతో నటీనటులు చేయని పనులను చేసినట్లుగా ఏఐ ద్వారా చూపించడం క్షమించరాని నేరమని మండిపడుతున్నారు. టెక్నాలజీని కొత్త ప్రయోగాలకు, విజ్ఞానానికి ఉపయోగించాలని సెలబ్రెటీల వ్యక్తిత్వాన్ని దిగజార్చడానికి కాదని హితవు పలుకుతున్నారు. బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించి అరెస్ట్ చేసి జైలుకు పంపాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.


