రేపటి నుంచి ‘నషా ముక్త్‌ భారత్‌ యాత్ర’ | Hyderabad Walk Drug Free India Kishan Reddy | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ‘నషా ముక్త్‌ భారత్‌ యాత్ర’

Nov 24 2026 9:34 AM | Updated on Nov 24 2026 9:34 AM

Hyderabad Walk Drug Free India Kishan Reddy

3 రోజులపాటు హైదరాబాద్‌లో నిర్వహణ

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో 29.8 కి.మీ. మేర యాత్ర  

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘హైదరాబాద్‌ వాక్స్‌ ఫర్‌ నషా ముక్త్‌ భారత్‌’ నినాదంతో ఈ నెల 25, 26, 27 తేదీల్లో మొత్తం 29.8 కి.మీ. మేర పాదయాత్ర జరగనుంది. డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్థాలపై సమాజంలో విస్తృత అవగాహన కలి్పంచడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమం పూర్తిగా రాజకీయాలకు అతీతమని తెలిపారు. 

2029 నాటికి మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణానికి ప్రధాని మోదీ చేసిన సంకల్పం సాకారం చేసే దిశగా ఈ యాత్రకు శ్రీకారం చడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 25న అంబర్‌పేట్‌ ఎంసీహెచ్‌ గ్రౌండ్‌ నుంచి ప్రారంభమై ముషీరాబాద్, అమీర్‌పేట మీదుగా జూబ్లీహిల్స్‌ వర కు సాగనుంది. 27న పాదయాత్ర ముగింపు సందర్భంగా భారతీయ విద్యాభవన్‌ సమీపంలో ‘సంకల్ప సభ’నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ పాదయాత్రకు ప్రముఖ నటులు చిరంజీవి, వెంకటే‹Ù, నాగార్జున, ప్రభాస్‌ మద్దతు ప్రకటించారు. కిషన్‌రెడ్డితో కలిసి ఈ యాత్రకు సంబంధించిన టీ–షర్టులను ఆవిష్కరించారు.

సమష్టి భాగస్వామ్యంతోనే ‘డ్రగ్స్‌ రహిత భారత్‌’: కిషన్‌రెడ్డి
డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ గొంతు విప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘హైదరాబాద్‌ వాక్స్‌ – నషా ముక్త్‌ భారత్‌’కార్యక్రమంలో యువత, తల్లిదండ్రులు, నగర ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. కేవలం ప్రభుత్వాల చర్యలతోనే కాకుండా, సమాజంలోని ప్రముఖులు, ప్రజలందరి సమష్టి భాగస్వామ్యంతోనే ‘డ్రగ్స్‌ రహిత భారత్‌’సాధ్యమవుతుందన్నారు.

ఇదీ చదవండి: మెట్రో రుణమా? నాకేమీ తెలీదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement