పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సందీప్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి
ప్రజా ప్రభుత్వంలో ప్రజల సంపద ప్రజలకే..
ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు
కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల్లేవు: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఆదాయాన్ని, వనరులను దుర్వినియోగం చేయడంతో పాటు రాష్ట్రాన్ని రూ.8.20 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అయితే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత రాష్ట్ర ఆదాయాన్ని తిరిగి ప్రజలకే చేరవేస్తూ, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని, గతంలో సంపద, వనరులు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైతే ప్రస్తుతం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని చెప్పారు.
సోమవారం గాం«దీభవన్‌లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల కొత్త ఇన్‌చార్జి బీఎం సందీప్‌ను భట్టి మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు గురించి సందీప్‌తో చర్చించినట్టు వెల్లడించారు. సందీప్ సేవలు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడతాయన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు లేవని, పార్టీ పటిష్టంగా ఉందని, కాంగ్రెస్ పారీ్టలో క్రమశిక్షణ అత్యంత సహజమైన అంతర్భాగమని పేర్కొన్నారు.
నదీ జలాలపై తప్పుడు ప్రచారం
కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై బీఆర్‌ఎస్ నాయకత్వం కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని భట్టి మండిపడ్డారు. రాష్ట్రానికి నదీ జలాల ద్వారా అత్యధిక ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారని, అయితే గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి లబ్ధి కలగాలనే ధ్యేయంతో ముందుకెళుతున్నామన్నారు. వ్యవస్థలను ధ్వంసం చేసిన వారికి రాష్ట్రంలో చోటు లేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఊహ ప్రపంచంలో బ్రతుకున్నాడని, సోషల్ మీడియానే ప్రపంచం అనుకుంటున్నాడని భట్టి ఎద్దేవా చేశారు.
మంత్రులతో విడివిడిగా సందీప్ భేటీ
బీఎం సందీప్ సోమవారం గాం«దీభవన్‌లో రాష్ట్ర మంత్రులతో విడివిడిగా సమావేశమయ్యారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహలు సందీప్‌ను కలిసి రాష్ట్రంలో పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల అమలు గురించి వివరించారు. కొందరు మంత్రులు తమ తమ శాఖల పరిధిలో గత మూడేళ్ల కాలంలో జరిగిన పురోగతిని వివరించారు.
తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో పార్టీ పరిస్థితి, ఇతర రాజకీయ పారీ్టల పరిస్థితిని గురించి మంత్రులను ఇన్‌చార్జి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో నడుస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేసిన ఆయన.. రెండోసారి పార్టీని అధికారంలోకి తెచ్చేలా మంత్రుల పనితీరు ఉండాలని సూచించారు. ఈ నెల 26న ఏఐసీసీ పిలుపు మేరకు జరిగే సంవిధాన్ బచావో ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఉంది 700 రోజులే: సందీప్
గతంలో ఏం జరిగిందనే దానితో సంబంధం లేకుండా భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం అనుబంధ సంఘాలు పనిచేయాలని సందీప్ కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇక మిగిలింది 700 రోజులు మాత్రమేనని, ఇప్పటి నుంచి గట్టిగా పనిచేయకపోతే యుద్ధం కష్టమవుతుందని వ్యాఖ్యానించారు. గాం«ధీభవన్‌లో పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన 26 మంది అధ్యక్షులు, చైర్మన్లతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని చెప్పారు. అయితే అబద్ధాల పునాదులపై పనిచేస్తున్న బీఆర్‌ఎస్ దు్రష్పచారం చేస్తుంటే, దానికి బీజేపీ సహాయకారిగా వ్యవహరిస్తోందని అన్నారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాలంటే అనుబంధ సంఘాలు గట్టిగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో పలు అనుబంధ సంఘాల చైర్మన్లు ఈర్లపల్లి శంకర్, కవ్వంపల్లి సత్యనారాయణ, ఎర్రబెల్లి స్వర్ణ, మెట్టు సాయికుమార్, శివచరణ్‌రెడ్డి, వెంకటస్వామి, అన్వేశ్‌రెడ్డి, ఇర్ఫాన్, ముత్తినేని వీరయ్య వర్మ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అంతా మీరే చేశారు!


