ఫెర్టిలిటీ కేంద్రాల వైద్యులకు బెయిల్‌ ఇవ్వలేం | Illegal Egg Collection Telangana High Court | Sakshi
Sakshi News home page

ఫెర్టిలిటీ కేంద్రాల వైద్యులకు బెయిల్‌ ఇవ్వలేం

Nov 24 2026 8:53 AM | Updated on Nov 24 2026 8:53 AM

Illegal Egg Collection Telangana High Court

అండాల సేకరణ కేసులో హైకోర్టు స్పష్టీకరణ

మహిళలను తీసుకొచ్చి హాస్టళ్లలో నిర్బంధించడం ఆందోళనకరం

సాక్షి, హైదరాబాద్‌: అక్రమంగా మానవ అండాలను సేకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు ఫెర్టిలిటీ కేంద్రాలు, ఆసుపత్రుల వైద్యులకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్ల విచారణ పరిధి చాలా పరిమితంగా ఉంటుందని, ప్రాథమిక దర్యాప్తు దశలో అన్ని అంశాలను లోతుగా పరిశీలించలేమని స్పష్టం చేసింది.

తెలంగాణలోని పలు ఆసుపత్రుల్లో అక్రమంగా అండాల సేకరణ రాకెట్లు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు, ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకొచ్చి రాష్ట్రంలోని వివిధ హాస్టళ్లలో నిర్బంధిస్తున్నారన్న అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య వృత్తిలో ఉన్నవారు వృత్తిపరమైన నైతిక విలువలను తప్పనిసరిగా పాటించాలని.. వైద్య వృత్తిలోకి ప్రవేశించే సమయంలో చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉండాలని గుర్తుచేసింది.

ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన 9 క్రిమినల్‌ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అండాల అక్రమ సేకరణకు సంబంధించి దాఖలైన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ డాక్టర్‌ పద్మజా సహా పలువురు నిందితులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ నర్సింగ్‌రావు నందికొండ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. విచారణ ప్రాథమిక దశలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడం సరికాదని పీపీ పల్లె నాగేశ్వర్‌రావు చెప్పిన వాదనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. వివిధ ఏజెన్సీల ముసుగులో కొంతమంది మహిళలను సమీకరించి, వారి నుంచి అండాలను సేకరిస్తున్నారని, వీరు చట్టంలో నిర్దేశించిన విధివిధానాలను పాటించారా? లేదా? అన్నది పరిశీలించాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి: వారి పదేళ్ల పాలనలో అప్పుల ఊబిలోకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement