మీరు జనసేన ఎమ్మెల్యేనా.. స్వతంత్ర అభ్యర్థి ప్రచారకర్తనా? | Women Question Jana Sena MLA Arava Sridhar | Sakshi
Sakshi News home page

మీరు జనసేన ఎమ్మెల్యేనా.. స్వతంత్ర అభ్యర్థి ప్రచారకర్తనా?

Nov 24 2026 9:20 AM | Updated on Nov 24 2026 9:27 AM

Women Question Jana Sena MLA Arava Sridhar

తిరుపతి: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను చిట్వేలి మండలం, భాకరాపురం కొత్తపల్లిలో సోమవారం మహిళలు నిలదీశారు. తిమ్మాయపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవికి పురం రమణమ్మ (స్వతంత్ర), గుంటిపల్లి నాగమణి (జనసేన మద్దతు) పోటీలో ఉన్నారు. 

ఆ పంచాయతీ పరిధిలోని భాకరాపురం కొత్తపల్లికి ఎమ్మెల్యే శ్రీధర్‌ తన అనుచరులతో కలిసి సోమవారం పురం రమణమ్మ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. గత జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా స్వతంత్ర అభ్యర్థికి జనసేన అభ్యర్థి మధ్య పోటీ జరగ్గా జనసేన ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్‌ తన సన్నిహితుడైన స్వతంత్ర అభ్యర్థికి ప్రచారం చేశారు. జనసేన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. 

మళ్లీ ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్‌ ఎన్నికల్లో అప్పట్లో స్వతంత్ర అభ్యర్థి పురం రమణమ్మ తరఫున ఎమ్మెల్యే ప్రచారం చేస్తుండడంతో ఆగ్రహించిన కొత్తపల్లి మహిళలు ఎమ్మెల్యేని నిలదీశారు. జనసేన ఎమ్మెల్యే అయి ఉండి, జనసేన మద్దతుదారుకు ప్రచారం చేయకుండా స్వతంత్ర అభ్యర్థికి ఎలా ప్రచారం చేస్తారని, ఇందుకోసమేనా మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కంగుతిన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఎమ్మెల్యే తీరు చూసి జనం అవాక్కయ్యారు.  

ఇదీ చదవండి: సాయంత్రం రాధికకు.. రాత్రికి రజనీకి..


 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement