సాక్షి, విజయనగరం జిల్లా: భోగాపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుందరపేట సమీపంలో లారీని కారు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఒకరు తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: రాజధాని ప్రాంతంలో పర్యావరణ విధ్వంసం


