తిరుపతి తుడా: ‘ఎస్సీలకు అవకాశం ఇవ్వరా..? పదవులన్నీ మీకేనా..? తిరుపతి నగరంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మీకు కనిపించరా..?’ అంటూ 8వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ నిలదీశారు. మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఎస్వీయూ సెనేట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎన్నికకు కార్పొరేటర్లను హాజరుపరిచారు.
డిప్యూటీ మేయర్‌గా పోటీ కోసం ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కాల్‌ఫర్ చేశారు. ఈ క్రమంలో కలుగజేసుకున్న ఎనిమిదవ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ సుబ్బ య్య 130 ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతి మున్సిపాలిటీలో ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు చైర్మన్, మే యర్ పదవులు దక్కాయా..? అని ప్రశ్నించారు. కనీసం వైస్ చైర్మన్, డిప్యూటీ పదవులు కూడా ఇవ్వరా..? అంటూ నిలదీశారు. అంతలో పక్కన ఉన్న కార్పొరేటర్లు కలుగజేసుకుని సర్ది చెప్పారు.


