కృష్ణా జలాలపై ప్రతిష్టంభన | Krishna Water Dispute Telangana Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాలపై ప్రతిష్టంభన

Nov 24 2026 9:41 AM | Updated on Nov 24 2026 9:41 AM

Krishna Water Dispute Telangana Andhra Pradesh

తాగునీటికి సాగర్‌ కుడి కాలువకు 8, ఎడమ కాలువకు ఒక టీఎంసీ, కృష్ణా డెల్టాకు 10 టీఎంసీలు కోరిన ఏపీ

తెలంగాణ ఈఎన్‌సీ అభ్యంతరం

సాగర్‌ ఎడమ కాలువకు 15, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 6 టీఎంసీలు కోరిన తెలంగాణ

వ్యతిరేకించిన ఏపీ ఈఎన్‌సీ..

అసంపూర్తిగా ముగిసిన త్రిసభ్య కమిటీ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో మిగిలి ఉన్న నిల్వలను తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు పంపిణీ చేసే అంశంపై ప్రతిష్టంభన నెలకొంది. రెండు రాష్ట్రాల నీటి అవసరాలపై చర్చించి.. కేటాయింపులపై బోర్డుకు సిఫార్సు చేయడం కోసం సోమవారం జలసౌధలోని కృష్ణా బోర్డు కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో త్వరలో జరగాల్సి ఉన్న బోర్డు సర్వసభ్య సమావేశంలో నీటి కేటాయింపులపై చర్చించి, నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డుకు త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సతీ‹Ùకుమార్‌ కాంబోజ్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ఈఎన్‌సీ రమేశ్‌ బాబు, ఏపీ ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి పాల్గొన్నారు.

కుదరని ఏకాభిప్రాయం 
తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌ నుంచి కుడి కాలువకు 8, ఎడమ కాలువకు టీఎంసీ, కృష్ణా డెల్టాకు మరో 10 టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ ఈఎన్‌సీ కోరారు. దీనిపై తెలంగాణ ఈఎన్‌సీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి కొరత నేపథ్యంలో కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయకూడదన్నారు. దీనిపై ఏపీ ఈఎన్‌సీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా డెల్టాకు సాగర్‌ నుంచి నీటిని విడుదల చేయలేదన్నారు. పులిచింతల, పోలవరం కుడి కాలువ ద్వారా వచి్చన జలాలను మాత్రమే కృష్ణా డెల్టా అవసరాలకు విడుదల చేశామని వివరించారు. దిగువ పరీవాహక ప్రాంతంగా డెల్టాకు హక్కుగా సంక్రమించిన జలాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దీనికి తెలంగాణ ఈఎన్‌సీ అంగీకరించలేదు. ఇప్పటికే యాసంగిలో 74.32 టీఎంసీల నీళ్లను కేడీఎస్‌కు వాడుకున్నారని, పులిచింతల ప్రాజెక్టులో 26.75 టీఎంసీల నిల్వ ఉండగా, ప్రకాశం బరాజ్‌లో 2.44 టీఎంసీల నిల్వ ఉందని ఆయన గుర్తు చేశారు.

కరువుతో నీటి కొరత ఏర్పడిన నేపథ్యంలో తాగునీటి అవసరాలకి నీళ్లను పరిరక్షించుకోవాల్సి ఉండగా, కేడీఎస్‌ కింద సాగునీటికి నీళ్లను ఎలా కోరతారని అభ్యంతరం తెలిపారు. సాగర్‌ ఎడమ కాలువకు 15 టీఎంసీలు, హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం ఏఎమ్మారీ్పకి 6 టీఎంసీలు విడుదల చేయాలని కోరారు. దీనిపై ఏపీ ఈఎన్‌సీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాగర్‌ ఎడమ కాలువ కింద 15 టీఎంసీల అవసరాలు ఏంటో చెప్పాలన్నారు. నీటి కేటాయింపులపై ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 

పట్నాడు వాటర్‌ గ్రిడ్‌కు అనుమతిలేదు... 
అనుమతి లేకుండా ఏపీ రాష్ట్రం పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ను చేపట్టిందని తెలంగాణ ఈఎన్‌సీ రమేశ్‌ బాబు చెప్పారు. కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాగర్‌ ఎడమ కాల్వకు నెలకు 5 టీఎంసీలు చొప్పున విడుదల చేయాలని కోరామన్నారు. ఎడమ, కుడి కాల్వల కింద తాగునీటికే నీళ్లను కోరాలని స్పష్టం చేశారు. ఏపీ కేడీఎస్‌కు 10 టీఎంసీలు కోరడాన్ని తప్పుబట్టారు. సాగర్‌ ఎడమ, కుడి కాల్వలకి 9 టీఎంసీల నీటి విడుదలపై సమావేశంలో సమ్మతి కుదిరిందని ఏపీ ఈఎన్‌సీ నరసింహమూర్తి మీడియాకు తెలిపారు. కేడీఎస్‌ అవసరాలపై కృష్ణాబోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి: రేపటి నుంచి ‘నషా ముక్త్‌ భారత్‌ యాత్ర’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement