అంటార్కిటికా కింద 30 బేసిన్‌లు | Scientists Discover a Vast Structure Hiding Beneath Antarctica Ice | Sakshi
Sakshi News home page

అంటార్కిటికా కింద 30 బేసిన్‌లు

Jun 13 2026 4:43 AM | Updated on Jun 13 2026 4:43 AM

Scientists Discover a Vast Structure Hiding Beneath Antarctica Ice

శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో వెలుగులోకి

అంటార్కిటికా ఖండం అంటేనే మంచుఖండం. సదరన్‌ (అంటార్కిటిక్‌) ఓషన్‌ మీద విస్తరించిన ఈ మంచుఖండం కింద భూభాగం ఉంది. జెనోవా విశ్వవిద్యాలయానికి చెందిన భూ బౌతిక శాస్త్రవేత్త ఎగిడియో అర్మాడిల్లో నేతృత్వంలోని బృందం పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ బృందం దాదాపు 30 బేసిన్‌లు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్న భూభాగాన్ని గుర్తించింది. పరిశోధకులు దీనిని ఈస్ట్‌ అంటార్కిటికా ఫ్యాన్‌ ఆకార బేసిన్‌ ప్రావిన్స్‌గా నామకరణం చేశారు.

మహాఖండం ఖండాలు కాకముందే..
గోండ్వానాలాండ్‌ అనేది దక్షిణార్థగోళంలో విస్తరించిన ప్రాచీన మహాఖండం. ఇది 1,800 కోట్ల ఏళ్ల కిందట విడిపోవడం మొదలై క్రమంగా ఖండాలుగా మారింది. ఇప్పుడు బయటపడిన భూభాగం గోండ్వానా విడిపోవడానికి ముందే ఏర్పడి ఉంటుందని.. అంటార్కిటికా, ఆ్రస్టేలియా వేరుపడడానికి బహుశా ఈ భూభాగమే కారణం అయి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎగిడియో అర్మాడిల్లో బృందం పరిశోధన మొదలు పెట్టింది ఈ భూభాగాన్ని అన్వేíÙంచడానికి కాదు.

ఇలాంటి ఒక భూభాగం ఉందని వారికి తెలియదు. అంటార్కిటికా మంచుఖండం మీద 27 మిలియన్‌ క్యూబిక్‌ కిలోమీటర్ల మేర మంచు ఉంది. ఆ మంచుపొరను తొలగిస్తే తూర్పు అంటార్కిటికా ఎలా ఉంటుందోననే తలంపుతో పరిశోధించారు. రాడార్‌ చిత్రాలు మంచు కింద కూరుకుపోయి ఉన్న ఈ భూభాగాన్ని చూపించాయి. అందులో 2 వేల కిలోమీటర్ల పొడవున్న తీరప్రాంతం వెంబడి విసనకర్ర ఆకారంలో శిలలు, శిఖరాలు వ్యాపించి ఉన్నాయి.

మంచు కరిగితే నేల పైకి లేస్తుంది!
ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. మంచు తన కింద ఉన్న భూభాగాన్ని కిందకు అదుముతోంది. ఒకవేళ ఆ మంచు కరిగిపోతే కింద ఉన్న నేల ఒక కిలోమీటర్‌ మేర పైకి లేస్తుంది. రాడార్, గురుత్వాకర్షణ, భూకంపనాల తీవ్రత, అయస్కాంత డేటాలను ఒకదానితో మరొకటి అనుసంధానం చేసిన పరిశోధకులు ఈ అవగాహనకు వచ్చారు. అంటార్కిటికా మంచుఖండం ఇప్పటికీ మనుషులు ఛేదించలేనంత జటిలమైనదిగానే ఉంది. కానీ పరిశోధకుల పరిశోధనల్లో క్రమక్రమంగా ఒక్కొక్క రహస్యం బయటపడుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement