సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇవ్వకుండా జెన్‌జీ భవిష్యత్తును నాశనం చేస్తుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ క్యాబినెట్ సగటు వయస్సు 62 సంవత్సరాలని ఆయన జెన్‌జీ గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందన్నారు. రేవంత్ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే కుటుంబ పాలన చేస్తున్నారని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి దర్యాప్తును కేంద్రానికి అప్పగించడం లేదని కేసులు ముందుకు కదలకుండా కేటీఆర్ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారని ప్రశ్నించారు. దోచుకున్న వారిని కాపాడుతూ రేవంత్ మరింత దోపిడికి పాల్పడుతున్నారని, రేవంత్, కేటీఆర్ కేవలం మెుక్కుబడికోసమే ఢిల్లీకి వచ్చారని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు..


