Basinski
-
అంటార్కిటికా కింద 30 బేసిన్లు
అంటార్కిటికా ఖండం అంటేనే మంచుఖండం. సదరన్ (అంటార్కిటిక్) ఓషన్ మీద విస్తరించిన ఈ మంచుఖండం కింద భూభాగం ఉంది. జెనోవా విశ్వవిద్యాలయానికి చెందిన భూ బౌతిక శాస్త్రవేత్త ఎగిడియో అర్మాడిల్లో నేతృత్వంలోని బృందం పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ బృందం దాదాపు 30 బేసిన్లు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్న భూభాగాన్ని గుర్తించింది. పరిశోధకులు దీనిని ఈస్ట్ అంటార్కిటికా ఫ్యాన్ ఆకార బేసిన్ ప్రావిన్స్‌గా నామకరణం చేశారు.మహాఖండం ఖండాలు కాకముందే..గోండ్వానాలాండ్ అనేది దక్షిణార్థగోళంలో విస్తరించిన ప్రాచీన మహాఖండం. ఇది 1,800 కోట్ల ఏళ్ల కిందట విడిపోవడం మొదలై క్రమంగా ఖండాలుగా మారింది. ఇప్పుడు బయటపడిన భూభాగం గోండ్వానా విడిపోవడానికి ముందే ఏర్పడి ఉంటుందని.. అంటార్కిటికా, ఆ్రస్టేలియా వేరుపడడానికి బహుశా ఈ భూభాగమే కారణం అయి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎగిడియో అర్మాడిల్లో బృందం పరిశోధన మొదలు పెట్టింది ఈ భూభాగాన్ని అన్వేíÙంచడానికి కాదు.ఇలాంటి ఒక భూభాగం ఉందని వారికి తెలియదు. అంటార్కిటికా మంచుఖండం మీద 27 మిలియన్ క్యూబిక్ కిలోమీటర్ల మేర మంచు ఉంది. ఆ మంచుపొరను తొలగిస్తే తూర్పు అంటార్కిటికా ఎలా ఉంటుందోననే తలంపుతో పరిశోధించారు. రాడార్ చిత్రాలు మంచు కింద కూరుకుపోయి ఉన్న ఈ భూభాగాన్ని చూపించాయి. అందులో 2 వేల కిలోమీటర్ల పొడవున్న తీరప్రాంతం వెంబడి విసనకర్ర ఆకారంలో శిలలు, శిఖరాలు వ్యాపించి ఉన్నాయి.మంచు కరిగితే నేల పైకి లేస్తుంది!ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. మంచు తన కింద ఉన్న భూభాగాన్ని కిందకు అదుముతోంది. ఒకవేళ ఆ మంచు కరిగిపోతే కింద ఉన్న నేల ఒక కిలోమీటర్ మేర పైకి లేస్తుంది. రాడార్, గురుత్వాకర్షణ, భూకంపనాల తీవ్రత, అయస్కాంత డేటాలను ఒకదానితో మరొకటి అనుసంధానం చేసిన పరిశోధకులు ఈ అవగాహనకు వచ్చారు. అంటార్కిటికా మంచుఖండం ఇప్పటికీ మనుషులు ఛేదించలేనంత జటిలమైనదిగానే ఉంది. కానీ పరిశోధకుల పరిశోధనల్లో క్రమక్రమంగా ఒక్కొక్క రహస్యం బయటపడుతోంది. -
మ్లాడెనోవిచ్‌కు చుక్కెదురు
సెమీస్‌లో బాసిన్‌స్కీ, ఒస్టాపెంకో పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో 30వ సీడ్ తిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్), అన్‌సీడెడ్ క్రీడాకారిణి ఒస్టాపెంకో (లాత్వియా) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో బాసిన్‌స్కీ 6–4, 6–4తో 13వ సీడ్ క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)ను బోల్తా కొట్టించగా... ఒస్టాపెంకో 4–6, 6–2, 6–2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 11వ సీడ్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించింది. గురువారం జరిగే సెమీఫైనల్లో బాసిన్స్కీతో ఒస్టాపెంకో తలపడుతుంది. యాదృచ్చికంగా గురువారమే వీరిద్దరి పుట్టినరోజు కావడం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, నాలుగో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)ను ఓడించిన మ్లాడెనోవిచ్ క్వార్టర్ ఫైనల్లో మాత్రం తడబడి మూల్యం చెల్లించుకుంది. అంతకుముందు మంగళవారం వర్షం కారణంగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లకు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో నాలుగు క్వార్టర్ ఫైనల్స్‌కు బదులుగా రెండు మాత్రమే సాధ్యమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం మంగళవారమే రాఫెల్ నాదల్ (స్పెయిన్), కరెనో బుస్టా (స్పెయిన్); జొకోవిచ్ (సెర్బియా), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ల మధ్య పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగాల్సింది. అయితే ఈ రెండు క్వార్టర్ ఫైనల్స్‌ను బుధవారానికి వాయిదా వేశారు.


