రెడ్‌ బాల్‌ క్రికెట్‌కు గుడ్ బై.. మహ్మద్ షమీ రిటైర్‌మెంట్‌ | Mohammed Shami announced retirement From Test Cricket | Sakshi
Sakshi News home page

Mohammed Shami: రెడ్‌ బాల్‌కు గుడ్ బై.. మహ్మద్ షమీ రిటైర్‌మెంట్‌

Nov 6 2026 11:56 PM | Updated on Nov 7 2026 12:04 AM

Mohammed Shami announced retirement From Test Cricket

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన రెడ్ బాల్ కెరీర్‌కు గుడ్‌ బై చెప్పారు. టెస్ట్ క్రికెట్‌కు ఆయన వీడ్కోలు పలికారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో మహ్మద్ షమీ శకం ముగిసినట్లే.

కాగా.. 36 ఏళ్ల మహమ్మద్ షమీ తన కెరీర్‌లో 64 టెస్టుల్లో 229 వికెట్లు పడగొట్టాడు. ఈ సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత్ తరఫున అతను చివరిసారిగా 2023 డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఆడాడు. ఈ మ్యాచ్‌ ఓవల్‌ వేదికగా జరిగింది. కాగా.. మహ్మద్ షమీ.. 2013లో వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో ఆరు సార్లు 5 వికెట్ల ఫీట్ సాధించారు.  

వీడియోలో షమీ మాట్లాడుతూ..'తొలిసారి టెస్టు జెర్సీ ధరించినప్పుడు దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఉండేది. ప్రతి వికెట్‌, తగిలిన గాయం, ఎదురైన ఇబ్బందులు జీవితంలో ఎన్నో విషయాలు నేర్పుకున్నా. నా టెస్ట్ కెరీర్‌లో నాకు మద్దతుగా నిలిచిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, కుటుంబసభ్యులు, కోట్లాది భారతీయులకు కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేశాడు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement