source: X
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు మరో కీలక బాధ్యత అప్పగించాలని భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ సూచించారు. షమీ తన అపారమైన బౌలింగ్ అనుభవాన్ని యువ క్రికెటర్లకు పంచాలని, బీసీసీఐ అతడికి కోచింగ్ బాధ్యతలు అప్పగించాలని కోరారు.
తాజాగా అజారుద్దీన్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. కపిల్ దేవ్ తర్వాత భారత్ చూసిన అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో షమీ ఒకడని కొనియాడారు. కపిల్ దేవ్‌తో షమీని నేరుగా పోల్చలేమని, అయినా అతడి బౌలింగ్ ప్రతిభ అదే స్థాయిలో ఉంటుందని వ్యాఖ్యానించారు.
భారత్‌లో ప్రతిభావంతులైన యువ ఫాస్ట్ బౌలర్లకు కొరత లేదని, వారి భవిష్యత్తును మరింత బలోపేతం చేయడానికి షమీ అనుభవం ఉపయోగపడుతుందని అజారుద్దీన్ అభిప్రాయపడ్డారు.
కాగా, 36 ఏళ్ల వయసులో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన షమీ, వన్డే, టీ20 క్రికెట్‌లో మాత్రం కొనసాగాలని భావిస్తున్నాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత జట్టులోకి తిరిగి రావడమే అతడి లక్ష్యంగా కనిపిస్తోంది.
ఈ దశగా అతడు దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు. ఫార్మాట్లకతీతంగా అతడు రాణిస్తున్నప్పటికీ, భారత జట్టు నుంచి మాత్రం అతడికి పిలుపు రావడం లేదు. మరి షమీ వన్డే, టీ20 జట్టులో స్థానం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడా.. లేక అజారుద్దీన్ ప్రతిపాదన ప్రకారం కోచింగ్ అవకాశం వస్తే వెళ్తాడా అనేది చూడాలి.
ఇదీ చదవండి: హార్దిక్ పాండ్యా ఔట్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ!


