భార‌త్‌తో విభేదాలు.. కీలక టోర్నీ నుంచి పాక్ అవుట్‌ | Pakistan Champions kicked out of WCL 2026 after PCB denies NOCs | Sakshi
Sakshi News home page

WCL 2026: భార‌త్‌తో విభేదాలు.. కీలక టోర్నీ నుంచి పాక్ అవుట్‌

Oct 4 2026 4:09 PM | Updated on Oct 4 2026 5:03 PM

Pakistan Champions kicked out of WCL 2026 after PCB denies NOCs

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మూడో సీజన్ నుంచి పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు వైదొలిగింది. ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఇచ్చేందుకు నిరాకరించడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.  

వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ జట్టు అక్టోబర్ 3న బంగ్లాదేశ్ ఛాంపియన్స్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ మ్యాచ్ వాయిదా పడినట్లు డబ్ల్యూసీఎల్ యాజమాన్యం ప్రకటించింది. అయితే పాక్ బోర్డు నుంచి ఎన్ఓసీ రాకపోవడమే ఆ మ్యాచ్ నిలిచిపోవడానికి అసలు కారణమని ఇప్పుడు స్పష్టమైంది.  

ఇప్పటికే పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టుకు చెందిన పలువురు ఆటగాళ్లు యూఏఈకి చేరుకున్నప్పటికీ, బోర్డు నుంచి అనుమతి పత్రాలు లభించకపోవడంతో వారు బరిలోకి దిగలేకపోయారు. అంతేకాకుండా, టోర్నీ కెప్టెన్ల సమావేశానికి, ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది గైర్హాజరయ్యాడు.  

గత సీజన్‌లో చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో పీసీబీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎడిషన్‌లో పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా భారత జట్టు పాకిస్తాన్‌తో ఆడటానికి రెండుసార్లు నిరాకరించింది. దాంతో ఘోర అవమానంగా భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఈసారి తమ ఆటగాళ్లకు ఎన్ఓసీ ఇచ్చేందుకు సుముఖత చూపలేదు.

కాగా ఈ సీజన్‌లో అక్టోబర్ 10న భారత్-పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు పాక్ టోర్నీ నుంచి వైదొలగడంతో దాయాదుల పోరు చూడాలనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ మిగిలింది.
చదవండి: IND vs AUS: ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌.. టీమిండియాకు భారీ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement