‘వర్షం ముప్పు.. భారత్‌ గెలవాలంటే అదొక్కటే దారి’ | India Vs Sri Lanka 1st Test, Aakash Chopra Suggests Bold Plan To Seal Victory Amid Rain Threat, Read Story Inside | Sakshi
Sakshi News home page

‘వర్షం ముప్పు.. భారత్‌ గెలవాలంటే అదొక్కటే దారి’

Aug 18 2026 8:53 AM | Updated on Aug 18 2026 9:55 AM

Aakash Chopra warns India-should bat-40 overs-Day 4-SL-1st Test

Photo Credit: BCCI Twitter

గాలే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్ 178 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి ప‌ట్టు బిగించింది. కానీ ఆట‌కు మ‌రో రెండు రోజులు మాత్ర‌మే ఉండ‌డం, వ‌ర్షం అంత‌రాయం క‌లిగిస్తుండ‌డంతో టీమిండియా మ్యాచ్ గెలుస్తుందా లేక డ్రాగా ముగుస్తుందా అన్న‌ది ఆస‌క్తిగా మారింది. అయితే భార‌త్ ఈ మ్యాచ్ గెల‌వాలంటే నాలుగో రోజు ఆట‌లో వీలైనంత వేగంగా ఆడాల్సి ఉంటుంద‌ని మాజీ క్రికెట‌ర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. 

గాలేలో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు మారుతున్న త‌రుణంలో భారత్ 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి లంక ఎదుట‌ సుమారు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే బాగుంటుంద‌ని తెలిపాడు. ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. "తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 178 ప‌రుగుల‌కు మరో 172 ప‌రుగులు జోడిస్తే 350 ప‌రుగుల దాకా వ‌స్తాయి. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం ఉంటుంది 

కాబ‌ట్టి 40 ఓవ‌ర్ల‌లో సాధ్య‌మైనంత ఎక్కువ ప‌రుగులు ఓవ‌ర్‌కు ఐదు ర‌న్స్ చొప్పున‌ (దాదాపు 200 ప‌రుగులు) చేస్తే బాగుంటుంది. ఆడుతున్న‌ది టెస్టు మ్యాచ్ అయిన‌ప్ప‌టికీ, వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల దృష్ట్యా మ‌న బ్యాట‌ర్లు ఆట‌ను టెస్టు నుంచి వ‌న్డే గేర్‌కు మార్చుకోవాలి. ఓపెన‌ర్లుగా వ‌చ్చే జైస్వాల్‌, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌లో దూకుడు ప్ర‌ద‌ర్శించాలి. 

టీ20 క్రికెట్ కాక‌పోయినా, క‌నీసం వ‌న్డే త‌ర‌హాలో కాస్త ఫాస్ట్‌గా ఆడేందుకు ప్ర‌య‌త్నించాలి. నాలుగో రోజు ఆట‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించ‌క‌పోతే స‌మ‌స్య లేదు. కానీ వ‌ర్షం ప‌డితే మాత్రం భార‌త్‌కు దెబ్బ ప‌డుతుంది. కాబ‌ట్టి వీలైనంత మేర ఫాస్ట్‌గా ఆడేందుకు య‌త్నించాలి. 

వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉండ‌డంతో నేనైతే భార‌త్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవ‌ర్లు ఇస్తాను. 150 నుంచి 175 ప‌రుగులు చేశాకే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలి. ఒకవేళ వ‌ర్షం ప‌డ‌క‌పోతే నాలుగో రోజు మిగిలిన 50 ఓవ‌ర్లు, చివ‌రి రోజు 90 ఓవ‌ర్ల ఆట ఉంటుంది కాబట్టి టీమిండియా ఫ‌లితం అనుకూలంగా లేదా ప్ర‌తికూలంగా వ‌చ్చేందుకు కూడా అవ‌కాశ‌ముంది." అని ఆకాశ్ చోప్రా వెల్ల‌డించాడు.

Read: Virat Kohli: 18 ఏళ్ల ప్రయాణంలో 18 అద్భుత క్షణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement