అఫ్గాన్‌ ప్లేయర్‌కు జాక్‌ పాట్‌.. కోట్లు వెచ్చించిన ముంబై ఇండియన్స్‌! | Farooqi shatters ILT20 auction record at USD 380,000 bid from MI Emirates | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌ ప్లేయర్‌కు జాక్‌ పాట్‌.. కోట్లు వెచ్చించిన ముంబై ఇండియన్స్‌!

Oct 2 2026 1:45 PM | Updated on Oct 2 2026 2:46 PM

Farooqi shatters ILT20 auction record at USD 380,000 bid from MI Emirates

PC: ILT20

దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2026 వేలంలో అఫ్గానిస్తాన్ పేస‌ర్ ఫజల్హక్ ఫరూఖీపై కాసుల వ‌ర్షం కురిసింది. 3,80,000 అమెరికన్ డాలర్ల (రూ. 3.6 కోట్లు)కు ఎంఐ ఎమిరేట్స్ సొంతం చేసుకుంది. త‌ద్వారా ఐఎల్‌టీ20 వేలం చ‌రిత్ర‌లోనే అత్యంత ఖ‌రీదైన ఆట‌గాడిగా ఫ‌రూఖీ నిలిచాడు. 

ఇంత‌కుముందు వెస్టిండీస్ ఆట‌గాడు ఆండ్రీ ఫ్లెచర్ పేరిట ఉండేది. సీజ‌న్ 4 వేలంలో ఫ్లెచ‌ర్‌ను 2,60,000 డాలర్ల(రూ. 2.45 కోట్లు)కు ఎంఐ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఎంఐ ఎమిరేట్స్ ఫ‌రూఖీపై భారీ మొత్తాన్ని వెచ్చించి త‌మ రికార్డును తామే బ్రేక్ చేసింది. కాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం,  ఎంఐ ఎమిరేట్స్ ఓన‌ర్ ఒక్క‌రే కావ‌డం గ‌మ‌నార్హం.

కాగా ఈ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ లియామ్ లివింగ్‌స్టోన్, అఫ్గానిస్తాన్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రహ్మనుల్లా గుర్బాజ్‌ల‌కు కూడా జాక్ పాట్ త‌గిలింది. లివింగ్‌స్టోన్‌ను 350,000 డాలర్ల(రూ.3.36 కోట్లు)కు,  గుర్బాజ్‌ను 310,000 (భార‌త క‌రెన్సీలో దాదాపు మూడు కోట్లు) గల్ఫ్ జెయింట్స్ తమ 'రైట్-టు-మ్యాచ్' ఆప్షన్‌ను ఉపయోగించి ద‌క్కించుకుంది. 

మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను దక్కించుకోవడానికి ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి దుబాయ్ క్యాపిటల్స్ అతడిని 3,00,000 డాలర్ల (సుమారు రూ. 2.88 కోట్లు) భారీ ధరకు సొంతం చేసుకుంది. పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ బాబ‌ర్ ఆజం మాత్రం బేస్ ప్రైస్‌కే అమ్ముడుపోయాడు. బాబర్‌ను 80,000 డాలర్ల (సుమారు రూ.76 లక్షలకు పైగా) డెసర్ట్ వైపర్స్ కైవ‌సం చేసుకుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement