breaking news
MI Emirates
-
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడిని ఔట్ చేసే అవకాశం ఉన్నా ప్రత్యర్ధి ఆటగాడు ఔట్ చేయకుండా వదిలేశాడు. దీనికి కారణం ఏంటంటే.. సదరు ఆటగాడు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇది గ్రహించిన ప్రత్యర్ది జట్టు వికెట్‌కీపర్ స్టంపౌట్ చేసే అవకాశమున్నా వదిలేశాడు.విషయాన్ని అర్దం చేసుకున్న బ్యాటర్ తరఫున టీమ్, మరో బంతి చూసి ఆ ఆటగాడిని రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు పిలిపించుకుంది. క్రికెట్ చరిత్రలో అరుదుగా జరిగే ఇలాంటి ఘటన ప్రస్తుతం జరుగుతున్న ఇంట్నేషనల్ టీ20 లీగ్-2025లో జరిగింది.A RARE INCIDENT IN CRICKET 🤯- Batter was struggling in the ILT20, so Nicholas Pooran decided not to get him out when he had the opportunity for a stumping. pic.twitter.com/x2Ikca0VnL— Johns. (@CricCrazyJohns) December 10, 2025ఈ లీగ్‌లో భాగంగా నిన్న (డిసెంబర్ 9) డెజర్ట్ వైపర్స్-ఎంఐ ఎమిరేట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో వైపర్స్ తొలుత బ్యాటింగ్ చేస్తుండగా.. ఆ జట్టు ఆటగాడు మ్యాక్స్ హోల్డన్ పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇది గ్రహించిన ప్రత్యర్ది జట్టు వికెట్‌కీపర్ నికోలస్ పూరన్ స్టంపౌట్ చేసే అవకాశమున్నా హోల్డన్‌ను ఔట్ చేయలేదు. బంతిని కనెక్ట్ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న హోల్డన్ మరికొద్ది సేపు క్రీజ్‌లో ఉంటే బంతులు వృధా చేయించవచ్చన్నది అతని ప్లాన్.అయితే పూరన్ ప్లాన్‌ను పసిగట్టిన వైపర్స్ కెప్టెన్ ఫెర్గూసన్ హోల్డన్‌ను రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు పిలిపించుకున్నాడు. ఈ తతంగం ఇన్నింగ్స్ 16వ ఓవర్లో జరిగింది. అప్పటికి వైపర్స్ స్కోర్ (118/1) చాలా తక్కువగా ఉండింది. హోల్డన్ క్రీజ్‌ను వీడాక కాస్త పుంజుకున్న వైపర్స్ స్కోర్ అంతిమంగా 159 పరుగులకు చేరింది.ఈ స్వల్ప లక్ష్య ఛేదనలోనూ ఎంఐ ఎమిరేట్స్ తడబడింది. ఓ దశలో సునాయాసంగా గెలుస్తుందనుకున్న ఈ జట్టు ఒకే ఓవర్లో (19) మూడు వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి లోనై పరాజయంపాలైంది. ఆఖరి ఓవర్లో గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. రషీద్ ఖాన్ వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి లక్ష్యానికి చేరువ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.చివరి బంతికి 2 పరుగులు చేయాల్సిన దశలో అర్వింద్ అద్భుతమైన త్రోతో ఎంఐ పుట్టి ముంచాడు. తొలి పరుగు పూర్తి చేసే లోపే అర్వింద్ డైరెక్ట్ త్రోతో ఘజన్‌ఫర్‌ను రనౌట్ చేశాడు. దీంతో ఎంఐకి ఓటమి తప్పలేదు. 19వ ఓవర్లో 3 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 4 వికెట్లు తీసిన డేవిడ్ పేన్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ ఓటమి
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ 2025 ఎడిషన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ (MI Emirates) మిశ్రమ ఫలితాలను చవి చూస్తుంది. తొలి మ్యాచ్‌లో గల్ఫ్ జెయింట్స్‌పై ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఈ జట్టు.. రెండో మ్యాచ్‌లో షార్జా వారియర్స్‌పై ఘన విజయం సాధించింది. తాజాగా డెసర్ట్ వైపర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒత్తిడికిలోనై సీజన్లో రెండో ఓటమిని మూటగట్టుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. ఛేదనలో ఓ దశలో పటిష్టంగా ఉండిన ఎంఐ లక్ష్యానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. వైపర్స్ బౌలర్ డేవిడ్ పేన్ 19వ ఓవర్లో ఒక్క పరుగే ఇచ్చి 3 వికెట్లు తీసి ఎంఐని భారీ దెబ్బేశాడు. చివరి ఓవర్లో ఎంఐ గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. రషీద్ ఖాన్ వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి లక్ష్యానికి చేరువ చేశాడు. అయితే చివరి బంతికి 2 పరుగులు కావాల్సిన దశలో అర్వింద్ అద్భుతమైన త్రోతో ఎంఐ పుట్టి ముంచాడు. తొలి పరుగు పూర్తి చేసే లోపే ఘజన్‌ఫర్‌ను రనౌట్ చేశాడు. దీంతో ఎంఐకి ఓటమి తప్పలేదు.19వ ఓవర్లో 3 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 4 వికెట్లు తీసిన డేవిడ్ పేన్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. వైపర్స్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్ హోల్డన్ (42 రిటైర్డ్ ఔట్) టాప్ స్కోరర్ కాగా.. ఫకర్ జమాన్ (35) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఎంఐ బౌలర్లలో ఘజన్ఫర్ 2, ఫజల్ హక్ ఫారూఖీ ఓ వికెట్ తీశారు.ఎంఐ ఇన్నింగ్స్‌లో టామ్ బాంటన్ (34) టాప్ స్కోరర్ కాగా.. పూరన్ (31), ముహమ్మద్ వసీం (24), పోలార్డ్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వైపర్స్ బౌలర్లలో పేన్ 4, తన్వీర్ 2, ఫెర్గూసన్, సామ్ కర్రన్ తలో వికెట్ తీశారు. -
పోలార్డ్ మెరిసినా, ముంబై ఓడెన్..!
దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. నిన్న (డిసెంబర్ 4) గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐఎ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.కెప్టెన్ పోలార్డ్ (33 బంతుల్లో 50; 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో, నికోలస్ పూరన్ (39 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించారు. ఆఖర్లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (6 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించాడు. మిగతా బ్యాటర్లలో ముహమ్మద్ వసీం 1, బెయిర్‌స్టో 11, బాంటన్ 6, తేజిందర్ దిల్లాన్ 15, రషీద్ ఖాన్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. జెయింట్స్ బౌలర్లలో నువాన్ తుషార, అజ్మతుల్లా తలో 2, హైదర్ రజ్జాక్, మొయిన్ అలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం సాధారణ లక్ష్య ఛేదనకు దిగిన జెయింట్స్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పథుమ్ నిస్సంక (42 బంతుల్లో 81; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో 14.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నిస్సంకకు మొయిన్ అలీ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (39 నాటౌట్) సహకరించారు. ఎంఐ బౌలర్లలో వోక్స్‌కు 2, ఘజనఫర్‌కు ఓ వికెట్ దక్కింది. -
మళ్లీ ముంబై ఇండియన్స్‌లోకి పోలార్డ్, పూరన్
డిసెంబర్ 2 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20) నాలుగో సీజన్ కోసం మాజీ ఛాంపియన్ ఎంఐ ఎమిరేట్స్ భారీ బలాన్ని చేకూర్చుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేరిట విధ్వంసకర ఆటగాళ్లు, విండీస్ ప్లేయర్లు కీరన్ పోలార్డ్ (Kieron Pollard), నికోలస్ పూరన్‌ను (Nicholas Pooran) రీటైన్ చేసుకుంది. పోలార్డ్, పూరన్ కొద్ది రోజుల కిందట మేజర్ లీగ్ క్రికెట్లో ఎంఐ ఎమిరేట్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ఎంఐ న్యూయార్క్‌కు టైటిల్‌ను అందించారు. ILT20-2025లో ఈ ఇద్దరు మరోసారి జత కట్టబోతున్నారు. ఈ ఎడిషన్‌ను ఎంఐ ఎమిరేట్స్ డిసెంబర్ 4న గల్ఫ్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలుపెడుతుంది. ఓపెనర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ దుబాయ్ క్యాపిటల్స్, రన్నరప్ డెసర్ట్ వైపర్స్ తలపడతాయి.వాస్తవానికి ILT20 లీగ్ వచ్చే ఏడాది జరగాల్సి ఉండింది. అయితే 2026 టీ20 ప్రపంచకప్ దృష్ట్యా దీన్ని ముందుకు జరిపారు. ఈ ఎడిషన్‌కు సంబంధించి ఈ నెల 1వ తేదీన వేలం జరిగింది. నాలుగేళ్ల లీగ్ చరిత్రలో వేలం జరగడం ఇదే మొదటిసారి. రిటెన్షన్లు, డైరెక్ట్ సైనింగ్ల పేరిట ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లతో ఒప్పందాలు చేసుకున్నాయి. తాజాగా ఎంఐ ఎమిరేట్స్ ఫ్రాంచైజీ వైల్డ్ కార్డ్‌ను ఉపయోగించి పోలార్డ్, పూరన్‌ను తిరిగి దక్కించుకుంది. గతంలో డ్రాఫ్టింగ్ సిస్టమ్ ద్వారా ఆటగాళ్లతో ఒప్పందాలు చేసుకునే వారు.ఇదిలా ఉంటే, వైల్డ్ కార్డ్ ద్వారా ఎం ఎమిరేట్స్ రిటైన్ చేసుకున్న పోలార్డ్, పూరన్‌కు ఘనమైన టీ20 ట్రాక్ రికార్డు ఉంది. పోలార్డ్ ఇప్పటివరకు 18 టీ20 టైటిళ్లు గెలిచి, పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు గెలిచిన ప్లేయర్‌గా చలామని అవుతుండగా.. పూరన్ కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు ఇప్పటికే 3 టీ20 టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. అవి కూడా ఎంఐ ఫ్రాంచైజీల తరఫునే కావడం విశేషం. పూరన్‌ను ఎంఐ ఎమిరేట్స్ వైల్డ్ కార్డ్‌ను ఉపయోగించి రీటైన్ చేసుకున్నా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌తో ఇదివరకే కుదిరిన ఒప్పందం కారణంగా ఈ సీజన్ మొత్తానికే దూరం కానున్నాడు. ఈసారి ILT20, SA20 షెడ్యూల్ తేదీలు క్లాష్ అవుతున్నాయి. కరీబియన్లతో నిండిపోయిందిఎంఐ ఎమిరేట్స్ స్క్వాడ్ కరీబియన్ ప్లేయర్లతో నిండిపోయింది. ఆండ్రీ ఫ్లెచర్, రొమారియో షెపర్డ్, అకీమ్ ఆగస్టే వంటి స్టార్స్ ఇప్పటికే జట్టులో ఉన్నారు. వీరితో పాటు టామ్ బాంటన్, జానీ బెయిర్‌స్టో, షకీబ్ అల్ హసన్, క్రిస్ వోక్స్ వంటి అంతర్జాతీయ స్టార్స్ కూడా ఉన్నారు.చదవండి: ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం -
ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ నుంచి ఔట్
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో (ILT20-2025) డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌కు (MI Emirates) షాక్ తగిలింది. ప్రస్తుత ఎడిషన్‌లో ఆ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో నాకౌటైంది. నిన్న (ఫిబ్రవరి 7) షార్జా వారియర్జ్‌తో (Sharjah Warriorz) జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ 6 వికెట్ల తేడాతో పరాజయంపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. 42 పరుగులు (22 బంతుల్లో; 6 ఫోర్లు, సిక్స్) చేసిన నికోలస్ పూరన్ ఎంఐ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టామ్ బాంటన్ (29), విల్ జాక్స్ (18), కుసాల్ పెరీరా (18), అకీల్ హొసేన్ (15) రెండంకెల స్కోర్లు చేశారు. భారీ హిట్టర్లు ఆండ్రీ ఫ్లెచర్ (0), బెవాన్ జాకబ్స్ (7), రొమారియో షెపర్డ్ (7) దారుణంగా విఫలమయ్యారు. వారియర్జ్ బౌలర్లలో టిమ్ సౌథీ 2, ఆడమ్ మిల్నే, దిల్షన్ మధుషంక, అస్టన్ అగర్, హర్మీత్ సింగ్, రోహన్ ముస్తఫా తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వారియర్జ్ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (40), జాన్సన్ ఛార్లెస్ (36) వారియర్జ్ విజయానికి గట్టి పునాది వేయగా.. టిమ్ సీఫర్ట్ (40 నాటౌట్), రోహన్ ముస్తఫా (2 నాటౌట్) వారియర్జ్‌ను విజయతీరాలకు చేర్చారు. జేసన్ రాయ్ (26) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఎంఐ బౌలర్లలో ముహమ్మద్ రోహిద్ ఖాన్ 3, ఫజల్ హక్ ఫారూకీ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపు అనంతరం వారియర్జ్ రెండో క్వాలిఫయర్‌లో డెసర్ట్ వైపర్స్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో విజేత ఫిబ్రవరి 9న జరిగే ఫైనల్లో దుబాయ్ క్యాపిటల్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.కాగా, యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఇప్పటిదాకా రెండు ఎడిషన్లు జరిగాయి. తొలి ఎడిషన్‌లో గల్ఫ్ జెయింట్స్ ఛాంపియన్‌గా నిలువగా.. రెండో సీజన్లో ఎంఐ ఎమిరేట్స్ విజేతగా నిలిచింది. గత ఎడిషన్ ఫైనల్లో ఎమిరేట్స్ దుబాయ్ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. ఈ సీజన్లో క్యాపిటల్స్ అందరికంటే ముందే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. -
టామ్ బాంటన్ విధ్వంసకర శతకం.. ముంబై ఇండియన్స్ ఘన విజయం
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ ఆటగాడు టామ్ బాంటన్ చెలరేగిపోతున్నాడు. డెజర్ట్ వైపర్స్‌తో నిన్న (జనవరి 27) జరిగిన మ్యాచ్‌లో బాంటన్ విధ్వంసకర శతకం బాదాడు. ఫలితంగా ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ 154 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 228 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 చరిత్రలో ఇది రెండో అత్యధిక టీమ్ స్కోర్. ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన టామ్ బాంటన్ 55 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. ఓపెనర్ ఆండ్రీ ఫ్లెచర్ 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బాంటన్, ఫ్లెచర్ రెండో వికెట్‌కు 198 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. యూఏఈ గడ్డపై టీ20ల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం.229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డెజర్ట్ వైపర్స్.. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్ల ధాటికి 12.3 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది. ముహమ్మద్ రోహిద్ ఖాన్, అల్జరీ జోసఫ్ తలో మూడు.. ఫజల్ హక్ ఫారూఖీ, డాన్ మౌస్లీ చెరో రెండు వికెట్లు పడగొట్టి వైపర్స్ ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు. వీరి దెబ్బకు వైపర్స్ ఇన్నింగ్స్‌లో ఒక్క ఆటగాడు కూడా కనీసం 15 పరుగులు చేయలేకపోయాడు. కెప్టెన్ సామ్ కర్రన్ (11), వికెట్‌కీపర్ ఆజమ్ ఖాన్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ వైపర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన వైపర్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.రెండో శతకంఈ సీజన్లో టామ్ బాంటన్కి ఇది రెండో శతకం. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 చరిత్రలో ఒకే సీజన్లో రెండు సెంచరీలు ఎవరూ చేయలేదు. తాజా శతకంతో బాంటన్ ఈ సీజన్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. బాంటన్ ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 156.36 స్ట్రయిక్‌రేట్‌తో 369 పరుగులు చేశాడు. ఈ సీజన్లో బాంటన్‌తో పాటు దుబాయ్ క్యాపిటల్స్ ఆటగాడు షాయ్ హోప్ ఒక్కడే సెంచరీ చేశాడు. -
రొమారియో షెపర్డ్ ఊచకోత
అబుదాబీ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2025లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ మరో విజయం సాధించింది. నిన్న (జనవరి 21) జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ అబుదాబీ నైట్‌రైడర్స్‌పై 28 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఎంఐ ఎమిరేట్స్ (6 పాయింట్లు) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 5 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో డెజర్ట్ వైపర్స్ (8 పాయింట్లు) టాప్ ప్లేస్‌లో ఉండగా.. అబుదాబీ నైట్‌రైడర్స్ (4) మూడో స్థానంలో, దుబాయ్ క్యాపిటల్స్ (4), షార్జా వారియర్జ్ (4), గల్ఫ్ జెయింట్స్ (2) వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి.రొమారియో షెపర్డ్ ఊచకోతతొలుత బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కెప్టెన్ నికోలస్ పూరన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పూరన్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేశాడు. ఓపెనర్లు కుసాల్ పెరీరా (20 బంతుల్లో 23; 5 ఫోర్లు), ముహమ్మద్ వసీం (35 బంతుల్లో 38; ఫోర్, 3 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో రొమారియో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఐదు బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. అంతకుముందు ఓవర్లోనూ షెపర్డ్ రెండు బౌండరీలు బాదాడు. షెపర్డ్ ఊచకోత దెబ్బకు ఎంఐ ఎమిరేట్స్ ప్రత్యర్థి ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో గత మ్యాచ్ సెంచరీ హీరో టామ్ బాంటన్ (9), కీరన్ పోలార్డ్ (5), మౌస్లీ (6) నిరాశపరిచారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో అలీ ఖాన్, జేసన్ హోల్డర్ తలో రెండు, ఇబ్రార్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు.187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్‌కు ఓ మోస్తరు ఆరంభం లభించింది. ఓపెనర్ కైల్ మేయర్స్ (14 బంతుల్లో 22; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ ఆండ్రియస్ గౌస్ (34 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఇన్నింగ్స్ మధ్యలో నైట్‌రైడర్స్ తడబడింది. జో క్లార్క్ (3), కైల్ పెప్పర్ (5), అలీషాన్ షరాఫు (4), లారీ ఇవాన్స్ (7) వెంటవెంటనే ఔటయ్యారు. ఈ దశలో బరిలోకి దిగిన ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) నైట్‌రైడర్స్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో రసెల్ ఏమీ చేయలేకపోయాడు. చివరి వరుస బ్యాటర్లు సునీల్ నరైన్ 13, డేవిడ్ విల్లే 1, జేసన్ హోల్డర్ 6 పరుగులు చేసి ఔటయ్యారు. నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. ఎమిరేట్స్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, రొమారియో షెపర్డ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్, ఫజల్ హక్ ఫారూకీ, వకార్ సలామ్కిల్, జహూర్ ఖాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
శతక్కొట్టిన టామ్ బాంటన్.. ముంబై ఇండియన్స్ తరఫున తొలి సెంచరీ
ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2025 ఎడిషన్‌లో రెండో సెంచరీ నమోదైంది. షార్జా వైపర్స్‌తో నిన్న (జనవరి 19) జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ ఆటగాడు టామ్ బాంటన్ శతక్కొట్టాడు. ఐఎల్టీ20 (ILT20) చరిత్రలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ తరఫున ఇదే తొలి సెంచరీ. బాంటన్‌కు ముందు ఐఎల్టీ20లో కేవలం ముగ్గురు మాత్రమే సెంచరీలు చేశారు. లీగ్ చరిత్రలో తొలి సెంచరీని టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (షార్జా వారియర్స్) చేయగా.. రెండో సెంచరీని అలెక్స్ హేల్స్ (డెజర్ట్ వైపర్స్) చేశాడు. లీగ్‌లో మూడో సెంచరీ ఇదే సీజన్లో నమోదైంది. సీజన్ నాలుగో మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌పై షాయ్ హోప్ (దుబాయ్ క్యాపిటల్స్) శతక్కొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. షార్జా వారియర్స్‌పై ఎంఐ ఎమిరేట్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన షార్జా వారియర్స్, ఓపెనర్ జాన్సన్ ఛార్లెస్ (42 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ అవిష్క ఫెర్నాండో (17 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. వీరిద్దరూ మినహా వారియర్స్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. లూక్ వెల్స్ (18), కరీమ్ జనత్ (18), ఎథన్ డిసౌజా (11) రెండంకెల స్కోర్లు చేశారు. జేసన్ రాయ్ (1), రోహన్ ముస్తఫా (6), కీమో పాల్ (4), కెప్టెన్ సౌథీ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్ రెండు, రొమారియో షెపర్డ్, వకార్ సలామ్కిల్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన ఎంఐ ఎమిరేట్స్ 17.4 ఓవర్లలో ఆడుతూపాడుతూ వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఎమిరేట్స్ ఆదిలోనే ముహమ్మద్ వసీం (12) వికెట్ కోల్పోయినా, టామ్ బాంటన్ (55 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు), ఇంపాక్ట్ ప్లేయర్ కుసాల్ పెరీరా (42 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయమైన 157 పరుగులు జోడించారు. ఐఎల్టీ20లో ముంబై ఇండియన్స్ తరఫున ఇదే అత్యధిక భాగస్వామ్యం. లీగ్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. ఐఎల్టీ20లో డెసర్ట్ వైపర్స్ ఆటగాళ్లు కొలిన్ మున్రో, అలెక్స్ హేల్స్ నెలకొల్పిన 164 పరుగుల భాగస్వామ్యం ఏ వికెట్‌కైనా అత్యధికం. 2023 సీజన్లో మున్రో, హేల్స్ ఈ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ గెలుపుతో ఎమిరేట్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. -
పూనకాలు తెప్పించిన పూరన్.. మరో టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ 2024 ఎడిషన్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ కైవసం చేసుకుంది. దుబాయ్ క్యాపిటల్స్‌తో నిన్న (ఫిబ్రవరి 17) జరిగిన ఫైనల్లో ఎమిరేట్స్ టీమ్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్.. నికోలస్ పూరన్ (27 బంతుల్లో 57 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెబర్ (37 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఉగ్రరూపం దాల్చడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో ముహమ్మద్ వసీం (24 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కుశాల్ పెరీరా (26 బంతుల్లో 38; 6 ఫోర్లు) కూడా రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో సికందర్ రజా, ఓలీ స్టోన్, జహీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. MI won the T20 league in India.MI won the T20 league in America.MI won the T20 league in Dubai. - MI franchise is ruling everywhere 🏆🫡 pic.twitter.com/ORTEE65GD0— Johns. (@CricCrazyJohns) February 17, 2024 అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన దుబాయ్ క్యాపిటల్స్.. ట్రెంట్ బౌల్ట్ (4-0-20-2), విజయ్‌కాంత్ వియాస్కాంత్ (4-0-24-2) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 163 పరుగులు (7 వికెట్ల నష్టానికి) మాత్రమే చేయగలిగింది. అకీల్ హొసేన్, రోహిద్ ఖాన్, సలాంకీల్ తలో వికెట్ పడగొట్టారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ (40), టామ్ బాంటన్ (35), జేసన్ హోల్డర్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. స్టార్ ఆటగాళ్లు సికందర్ రజా (10), రోవ్‌మన్ పావెల్ (8) విఫలమయ్యారు. మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగిన ముంబై కెప్టెన్ పూరన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ఇది తొమ్మిదో టైటిల్. MI won CLT20 in 2011MI won IPL in 2013MI won CLT20 in 2013MI won IPL in 2015MI won IPL in 2017MI won IPL in 2019MI won IPL in 2020MI won WPL in 2023MINY won MLC in 2023MIE won ILT20 in 2024The Dominance of MI franchise. 🤯🔥 pic.twitter.com/GcGDcOqQ4I— Johns. (@CricCrazyJohns) February 17, 2024 -
నిన్న ప్రత్యర్దులు.. నేడు సహచరులు, ఒక్క రోజులో సీన్ రివర్స్
ఆధునిక క్రికెట్ ప్రపంచంలో క్రికెటర్ల పరిస్థితి రోజుకో తీరుగా మారింది. ఓ రోజు ఓ జట్టుకు ఆడిన ఆటగాళ్లు.. మరో రోజు మరో జట్టుకు ఆడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి వెలుగుచూసింది. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన టీ20 మ్యాచ్‌లో ప్రత్యర్దులుగా బరిలోకి దిగిన నికోలస్ పూరన్ (వెస్టిండీస్), టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా).. ఇవాళ ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఒకే జట్టుకు ఆడుతున్నారు. నిన్నటి వరకు ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఉండిన క్రికెటర్లు రోజు మారే సరికి దుబాయ్‌లో వాలిపోయారు. ILT20 2024లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 14) జరుగుతున్న తొలి క్వాలిఫయర్‌లో పూరన్, డేవిడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. గల్ఫ్ జెయింట్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఎంఐ ఎమిరేట్స్ ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగింది. 6 ఓవర్లు ముగిసే సరికి ఎమిరేట్స్ స్కోర్ 45/2గా ఉంది. ముహమ్మద్ వసీం (12), ఆండ్రీ ఫ్లెచర్ (0) ఔట్ కాగా.. పూరన్ (9), కుశాల్ పెరీర్ (22) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుండగా.. ఓడిన జట్టు రేపు (ఫిబ్రవరి 15) జరిగే క్వాలిఫయర్-2లో దుబాయ్ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఫైనల్లో తలపడుతుంది. -
అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. ముంబై ఇండియన్స్ విచిత్ర పరిస్థితి
ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషన్ టీ20 లీగ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఈ ఫ్రాంచైజీకి చెందిన జట్లు ఓ లీగ్‌లో ఒకలా మరో, మరో లీగ్‌లో ఇంకోలా ఆడుతున్నాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ వరుస పరాజయాలు (10 మ్యాచ్‌ల్లో 7 ఓటములు) చవిచూసి, లీగ్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టు నిలువగా.. ఇంటర్నేషనల్ లీగ్‌కు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా మారిపోయింది. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ జట్టు వరుస విజయాలతో (8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) దూసుకుపోతూ ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ కీరన్ పోలార్డ్ నేతృత్వంలో బరిలో నిలువగా.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్ నికోలస్ పూరన్ సారథ్యంలో పోటీలో ఉంది. ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగిన మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్‌పై విజయంతో ఎంఐ ఎమిరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. కెప్టెన్ సుడిగాలి ఇన్నింగ్స్.. డెజర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా అర్ధసెంచరీతో (46 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్), అంబటి రాయుడు (38 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో కెప్టెన్ పూరన్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (15 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. వైపర్స్ బౌలర్లలో మొహమ్మద్ అమిర్ 2, సౌటర్, హసరంగ, పతిరణ తలో వికెట్ పడొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వైపర్స్ టాపార్డర్ అంతా విఫలం కావడంతో లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది. విధ్వంసకర హిట్టర్లు అలెక్స్ హేల్స్ (6), కొలిన్ మున్రో (7) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ అలీ నసీర్ (63 నాటౌట్) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. అతనికి లూక్ వుడ్ (30) తోడైనప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైపర్స్‌ను ఎంఐ బౌలర్ ఫజల్ హక్ ఫారూకీ (4-0-31-4) దెబ్బ తీశాడు. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ మరో రెండు లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సౌతాఫ్రికా లీగ్ విషయానికొస్తే.. నిన్న ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ఓటమితో ఈ లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ కథ ముగిసింది. -
క్రికెట్ చరిత్రలోనే సంచలన క్యాచ్.. పక్షిలా ఎగురుతూ! వీడియో వైరల్
ఇంటర్నేషనల్ లీగ్ 2024లో భాగంగా ఆదివారం అబుదాబి వేదికగా ఎంఐ ఎమిరేట్స్, అబుదాబి నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ అద్బుతమైన క్యాచ్‌తో మెరిశాడు. అబుదాబి బ్యాటర్ లారీ ఎవాన్స్‌ను సంచలన క్యాచ్‌తో బౌల్ట్ పెవిలియన్‌కు పంపాడు. అబుదాబి ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన ఫజల్హాక్ ఫరూఖీ బౌలింగ్‌లో ఎవాన్స్ లాంగ్ ఆఫ్ మీదగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో లాంగ్ ఆఫ్‌లో ఉన్న బౌల్ట్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ఎవాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. బౌల్ట్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో అబుదాబి నైట్ రైడర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఎంఐ ఎమిరేట్స్ విజయం సాధించింది. N̶o̶ f̶l̶y̶ z̶o̶n̶e̶ this term doesn't exist in Boult's dictionary ✈️ #MIEvADKR | #DPWorldILT20onZee | #KoiKasarNahiChhodenge pic.twitter.com/RUPxDCx488 — Zee Cricket (@ilt20onzee) January 28, 2024 -
రెచ్చిపోయిన రసెల్.. 17 బంతుల్లో 6 సిక్సర్లు, అయినా ఓడిన నైట్‌రైడర్స్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ శివాలెత్తిపోయాడు. ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే ఏకంగా 6 సిక్సర్లు కొట్టి 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయినా ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ ఓటమిపాలైంది. రసెల్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రసెల్‌తో పాటు జో క్లార్క్ (21), మైఖేల్ పెప్పర్ (38), అలీషాన్ షరాఫు (37), సామ్ హెయిన్ (40) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ 3 వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్, వకార్ సలామ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఎంఐ ఎమిరేట్స్ మరో ఓవర్ మిగిలుండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు కుశాల్ పెరీరా (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ముహమ్మద్ వసీం (61 బంతుల్లో 87 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో ఎమిరేట్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆఖర్లో ఎమిరేట్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ సైతం విరుచుకుపడ్డాడు. పూరన్ కేవలం 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. ముహమ్మద్ వసీం.. టిమ్ డేవిడ్ (10) సాయంతో ఎమిరేట్స్‌ను గెలిపించాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో డేవిడ్ విల్లే, అలీ ఖాన్లకు తలో వికెట్ దక్కింది. అలెక్స్ హేల్స్ మెరుపు ఇన్నింగ్స్ వృధా.. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్‌పై షార్జా వారియర్స్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన వైపర్స్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కెప్టెన్ టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (68) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వైపర్స్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ హేల్స్ (61) అర్దసెంచరీతో రాణించాడు. వారియర్స్ బౌలర్లు క్రిస్ వోక్స్ (2/26), డేనియల్ సామ్స్ (2/29) వైపర్స్ పతనాన్ని శాశించాడు. -
ఇదేమి సిక్స్‌రా బాబు.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్
ఇంటర్నేషనల్ లీగ్-2024లో ఎంఐ ఎమిరేట్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం షార్జా వేదికగా షార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో ఎమిరేట్స్ ఘన విజయాన్ని అందుకుంది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షార్జా.. ముంబై బౌలర్ల దాటికి 12.1 ఓవర్లలో కేవలం 74 పరుగులకే కుప్పకూలింది. ఎంఐ బౌలర్లలో స్పిన్నర్ అకిల్ హోస్సేన్ 4 వికెట్లతో చెలరేగగా.. బౌల్ట్, సలీమీఖాల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో కుశాల్ పెరీరా, ఫ్లెచర్ చెరో 42 పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. నికోలస్ పూరన్ భారీ సిక్సర్.. కాగా ఈ మ్యాచ్‌లో ఎమిరేట్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్ బాదాడు. ఎంఐ ఇన్నింగ్స్ 19 ఓవర్లో క్రిస్ వోక్స్ వేసిన యార్కర్‌ను.. పూరన్ మిడ్ వికెట్ మీదగా 102 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. దెబ్బకు బంతి స్టేడియం బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో పూరన్ 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. The 𝙋𝙤𝙤𝙧𝙖𝙣 show 🥵 Waah, kya maara hai 👌#SWvMIE | #DPWorldILT20onZee | #KoiKasarNahiChhodenge pic.twitter.com/GwswS0vW0V — Zee Cricket (@ilt20onzee) January 26, 2024 -
మళ్లీ ముంబై ఇండియన్స్ గూటికి అంబటి రాయుడు
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు మరోసారి ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో చేరాడు. 2010 నుంచి 2017 వరకు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రాయుడు.. యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సీజన్-2 (2024) కోసం మళ్లీ ముంబై ఇండియన్స్‌తో జతకట్టాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఎంఐ ఎమిరేట్స్‌గా బరిలోకి దిగే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ, వచ్చే సీజన్ కోసం 8 మంది కొత్త ఆటగాళ్లతో డీల్ కుదుర్చుకుంది. వీరిలో రాయుడుతో పాటు కోరె ఆండర్సన్ (న్యూజిలాండ్), ఓడియన్ స్మిత్ (వెస్టిండీస్), అకీల్ హొసేన్ (వెస్టిండీస్), కుశాల్ పెరీరా (శ్రీలంక) లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. వీరితో పాటు శ్రీలంక యువ ఆటగాడు విజయకాంత్ వియాస్కాంత్, వకార్ సలామ్‌కీల్, నోష్తుష్ కెంజిగే లాంటి కొత్త ఆటగాళ్లు కూడా ఎంఐ ఫ్యామిలీలో చేరారు. పై పేర్కొన్న 8 మంది చేరికతో ఎంఐ ఎమిరేట్స్ జట్టు సంఖ్య 20కి చేరింది. ఇక ఎంఐ ఫ్యామిలీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల విషయానికొస్తే.. ఎంఐ ఎమిరేట్స్ 12 మంది పాత వారిని తిరిగి తమతో చేర్చుకుంది. విండీస్ ఆటగాళ్లు కీరన్ పోలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ఆండ్రీ ఫ్లెచర్, న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, ఫజల్ హక్ ఫారూఖీ, ముహ్మమద్ వసీం, జహూర్ ఖాన్, జోర్డన్ థాంప్సన్, విలియమ్ స్మీడ్, మెక్కెన్నీ క్లార్క్, డేనియల్ మోస్లీలను ఎంఐ ఎమిరేట్స్ తిరిగి రిటైన్ చేసుకుంది. కాగా, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సీజన్-2 వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కరీబియన్ లీగ్ 2023లో రాయుడు.. ఐపీఎల్ సూపర్ స్టార్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం కొద్ది కాలంపాటు గ్యాప్ తీసుకుని, ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో రాయుడు సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ప్రవీణ్ తాంబే తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్న రెండో భారత క్రికెటర్‌గా రాయుడు రికార్డుల్లోకెక్కాడు. 2020 సీజన్లో ప్రవీణ్ తాంబే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున సీపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. -
ముంబై ఎమిరేట్స్ ఔట్.. ఫైనల్‌కు చేరిన గల్ఫ్ జెయింట్స్
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2023 ఫైనల్లో గల్ఫ్ జెయింట్స్ అడుగుపెట్టింది. దుబాయ్ వేదికగా క్వాలిఫియర్-2లో ఎంఐ ఎమిరేట్స్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్ బెర్త్‌ను గల్ఫ్ జెయింట్స్ ఖారారు చేసుకుంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జెయింట్స్ 18.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి చేధించింది. జెయింట్స్ బ్యాటర్లలో జేమ్స్ విన్స్ 83 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి తమ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ, రషీద్ ఖాన్ తలా రెండు వికెట్లు, బ్రావో, బౌల్ట్ చెరో వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఎమిరేట్స్ బ్యాటర్లలో కెప్టెన్ పొలార్డ్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్ మహ్మద్ వసీం 31 పరుగులతో రాణించాడు. ఇక ఫిబ్రవరి 12 దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్లో డిసార్ట్ వైపర్స్‌తో జెయింట్స్ తలపడనుంది. చదవండి: T20 WC: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్! We have our second finalist! 🙌@GulfGiants beat @MIEmirates by 4 wickets and make a dashing entry into the FINAL of the #DPWorldILT20. Congratulations 👏#DPWorldILT20 #ALeagueApart #GGvMIE pic.twitter.com/7AQTvcJdlo — International League T20 (@ILT20Official) February 10, 2023 -
సిక్సర్ల మోత మోగించిన పూరన్, ఫ్లెచర్.. దద్దరిల్లిన షార్జా స్టేడియం
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీ చివరి దశకు చేరింది. క్వాలిఫయర్-2 బెర్తులతో (గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్) పాటు ఓ ఫైనల్ బెర్త్ (డెసర్ట్ వైపర్స్) ఖరారయ్యాయి. గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్ జట్ల మధ్య ఇవాళ (ఫిబ్రవరి 10) జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ విన్నర్ ఫిబ్రవరి 12న జరిగే లీగ్ తుది పోరులో డెసర్ట్ వైపర్స్‌తో తలపడుతుంది. ఇక, దుబాయ్ క్యాపిటల్స్, ఎంఐ ఎమిరేట్స్ మధ్య నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఎంఐ టీమ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి దుబాయ్ క్యాపిటల్స్‌ను ఇంటికి పంపింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఎంఐ టీమ్.. దుబాయ్ క్యాపిటల్స్‌ను 151/5 స్కోర్‌కే పరిమితం చేసింది. ఎంఐ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. డ్వేన్ బ్రావో ఓ వికెట్ దక్కించుకున్నాడు. దుబాయ్ ఇన్నింగ్స్‌లో మున్సే (43 బంతుల్లో 51; 6 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించగా.. సికందర్ రజా (34 బంతుల్లో 38; 4 ఫోర్లు), రోవ్‌మన్ పావెల్ (22 బంతుల్లో 30; 3 సిక్సర్లు) పర్వాలేదనిపించారు. పేలిన పూరన్, ఫ్లెచర్.. .. దద్దరిల్లిన షార్జా స్టేడియం 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎంఐ టీమ్.. కేవలం 16.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆండ్రీ ఫ్లెచర్ (45 బంతుల్లో 68 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), నికోలస్ పూరన్ (36 బంతుల్లో 66 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన మెరుపు అర్ధశతకాలతో తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. దుబాయ్ బౌలర్లలో జేక్ బాల్, దసున్ శనకలకు తలో వికెట్ దక్కింది. ముహమ్మద్ వసీమ్ (2), లోర్కాన్ టక్కర్ (10) తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా ఫ్లెచర్, పూరన్ జోడీ బౌండరీలు, సిక్సర్ల మోత మోగించి, తమ జట్టును క్వాలిఫయర్-2కు చేర్చారు. పూరన్, ఫ్లెచర్ మెరుపు విన్యాసాల ధాటికి షార్జా స్టేడియం దద్దరిల్లింది. -
ప్రమాదకరంగా మారుతున్న పొలార్డ్.. ప్లేఆఫ్స్‌కు ఎంఐ ఎమిరేట్స్
అబుదాబి వేదికగా జరుగుతున్న తొలి ఎడిషన్ ఇంటర్నేషనల్ లీగ్ టి20లో ఎంఐ ఎమిరేట్స్ దుమ్మురేపుతుంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ రోజురోజుకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాడు. ఇప్పటికే వరుస అర్థసెంచరీలతో జోరు కనబరుస్తున్న పొలార్డ్ తాజాగా మరో కీలక ఇన్నింగ్స్‌తో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన పొలార్డ్ 337 పరుగులు చేశాడు. మూడు అర్థసెంచరీలు సాధించిన పొలార్డ్ ప్రస్తుతం లీగ్‌లో రెండో టాప్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. శుక్రవారం లీగ్‌లో భాగంగా ఎంఐ ఎమిరేట్స్, అబుదాబి నైట్‌రైడర్స్ మధ్య 26వ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మహ్మద్ వసీమ్ 60 పరుగులతో రాణించగా.. ఆఖర్లో పొలార్డ్ 17 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. టక్కర్ 33 పరుగులు చేశాడు. అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అబుదాబి నైట్‌రైడర్స్ 19.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రీ రసెల్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో డ్వేన్ బ్రేవో మూడు వికెట్లు తీయగా.. ఇమ్రాన్ తాహిర్, జహూర్ ఖాన్లు చెరో రెండు వికెట్లు తీశారు. కాగా ఈ విజయంతో ఎంఐ ఎమిరేట్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోగా.. సీజన్లో అబుదాబి నైట్‌రైడర్స్‌కు ఇది వరుసగా ఎనిమిదో పరాజయం. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ రద్దు కాగా.. ఎనిమిదింటిలో ఓడిన ఆ జట్టు ఎప్పుడో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఇక ఇప్పటికే డెసర్ట్ వైపర్స్, గల్ఫ్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్‌కు వెళ్లగా.. తాజాగా ఎంఐ ఎమిరేట్స్ ప్లేఆఫ్‌కు చేరకుంది. ఇక షార్జా వారియర్స్, దుబాయ్ క్యాపిటల్స్‌లో ఏ జట్టు నాలుగో స్థానంలో ప్లేఆఫ్‌కు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. Four 4️⃣s. Three 6️⃣s. A powerful 4️⃣3️⃣ off just 17 balls.@KieronPollard55 lit up the field with every shot. Another #DPWorldILT20 innings you don't want to miss! #ALeagueApart #MIEvADKR @MIEmirates pic.twitter.com/vR4FkASBZs — International League T20 (@ILT20Official) February 3, 2023 With a never-say-die attitude, the @MIEmirates have made it to the playoffs 🤩 Congratulations, team 💙 #MIEmirates #DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/46XEgirZxK — International League T20 (@ILT20Official) February 3, 2023 చదవండి: అంత భయమేలా.. అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్ -
ILT20 2023: తిరిగిస్తాడనుకుంటే పారిపోయాడు
అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20 క్రికెట్లో హాస్యాస్పద సన్నివేశం చోటుచేసుకుంది. బ్యాటర్ కొట్టిన బంతి స్టేడియం అవతల పడింది. అయితే స్డేడియం బయట ఉన్న వ్యక్తి దానిని క్యాచ్‌గా తీసుకున్నాడు. ఆ తర్వాత బంతిని తీసుకొని అక్కడినుంచి పారిపోయాడు. చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేకపోయినప్పటికి సదరు వ్యక్తి చర్య నవ్వులు పూయించింది. ఎంఎఐ ఎమిరేట్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది. ఎమిరేట్స్ బ్యాటింగ్ సమయంలో మౌస్లే డీప్‌స్క్వేర్ లెగ్ దిశగా బంతిని స్టాండ్స్ బయటికి పంపించాడు. బంతి వెళ్లి నేరుగా రోడ్డుపై పడింది. ఆ తర్వాత ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని తీసుకున్నాడు. స్టేడియంలోకి తిరిగి విసురుతాడనుకుంటే.. బంతితో అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ తర్వాత కాసేపటికే కీరన్ పొలార్డ్ భారీ సిక్సర్ కొట్టాడు. ఈసారి కూడా బంతి స్టేడియం అవతల పడింది. ఆ వ్యక్తి మళ్లీ కనిపిస్తాడేమో అని చూస్తే బంతిని తీసుకోవడానికి ఎవరు రాలేదు. దీనికి సంబంధించిన వీడియోను ఐఎల్టి20 తన ట్విటర్లో షేర్ చేసింది. సిక్సర్ల వర్షం కురుస్తోంది.. మీరు ఏ టైప్ క్రికెట్ లవర్స్.. 1). తీసుకొని పారిపోవడం..2). తీసుకొని తిరిగిచ్చేయడం .. మీరే ఎంపిక చేసుకొండి అంటూ కామెంట్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఎంఐ ఎమిరేట్స్ 157 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోరు చేసింది. మహ్మద్ వసీమ్ 86, ఆండ్రీ ఫ్లెచర్ 50, కీరన్ పొలార్డ్ 50, మౌస్లే 31 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్ 84 పరుగులకే కుప్పకూలింది. ఎమిరేట్స్ బౌలింగ్‌లో ఫజల్లా ఫరుఖీ మూడు వికెట్లు తీయగా.. జహూర్ ఖాన్, ఇమ్రాన్ తాహిర్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. When it’s raining 6️⃣s, There are 2 types of cricket lovers.. 1. Pick and run 🏃♂️ 2. Pick and return Which category are you? Book your tickets now : https://t.co/sv2yt8acyL#DPWorldILT20 #ALeagueApart #DVvMIE pic.twitter.com/P0Es01cMz8 — International League T20 (@ILT20Official) January 29, 2023 చదవండి: కాఫీ బ్యాగులతో ఆసీస్ క్రికెటర్; తాగడానికా.. అమ్మడానికా? రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ ఓపెనర్ -
86 పరుగులకే కుప్పకూలిన వైపర్స్.. 157 పరుగుల తేడాతో ముంబై విజయం
ఇంటర్నేషనల్ లీగ్‌లో భాగంగా ఆదివారం డెసర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఎమిరేట్స్ ఏకంగా 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 241 పరుగుల భారీ లక్క్ష్యంతో బరిలోకి దిగిన డెసర్ట్ వైపర్స్.. ముంబై బౌలర్లు చెలరేగడంతో 84 పరుగులకే కుప్పకూలింది. ముంబై పేసర్ ఫజల్హక్ ఫారూఖీ మూడు వికెట్లు పడగొట్టి వైపర్స్ వెన్ను విరచగా.. తహీర్, జహూర్ ఖాన్ చెరో రెండు వికెట్లు, బౌల్ట్, బ్రావో, మౌస్లీ తలా వికెట్ సాధించారు. వైపర్స్ బ్యాటర్లలో టామ్ కుర్రాన్(12), మార్క్ వాట్(12) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. చెలరేగిన వసీం, పొలార్డ్ ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఎమిరేట్స్ బ్యాటర్లలో మహ్మద్ వసీం విధ్వంసం సృష్టించాడు. 44 బంతులు ఎదుర్కొన్న వసీం 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫ్లెచర్(50), పొలార్డ్(50 నాటౌట్) రాణించారు. కాగా పొలార్డ్ తన అర్ధ సెంచరీని కేవలం 19 బంతుల్లోనే సాధించడం గమానార్హం. వైపర్స్ బౌలర్లలో టామ్ కుర్రాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. చదవండి: పాండ్యాది చెత్త నిర్ణయం.. నంబర్ 1 బౌలర్ విషయంలో ఎందుకలా? హుడాను మాత్రం.. The moment Waseem decided to cut loose 🙌#MIEmirates #OneFamily #DVvMIEpic.twitter.com/4SJFdGdqrV — MI Emirates (@MIEmirates) January 29, 2023 -
విన్యాసం బాగానే ఉంది.. ఆ ఎక్స్‌ప్రెషన్‌కు అర్థమేంటి!
అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20లో ముంబై ఎమిరేట్స్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలతో మెరిసిన పొలార్డ్ ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. మంగళవారం డెసర్ట్ వైపర్స్‌తో మ్యాచ్‌లో పొలార్డ్ క్యాచ్ తీసుకునే క్రమంలో చేసిన విన్యాసం అదుర్స్ అనిపించింది. బౌండరీ లైన్ వద్ద ఒంటిచేత్తో పొలార్డ్ అందుకున్న క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సమిత్ పటేల్ వేసిన ఫుల్‌టాస్ బంతిని కొలిన్ మున్రో లాంగాన్ దిశగా బాదాడు. కచ్చితంగా సిక్సర్ అనుకున్న తరుణంలో అక్కడే ఉన్న పొలార్డ్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ను తీసుకొని వెనుకవైపుకు డైవ్ చేశాడు. ఆ తర్వాత బౌండరీలైన్ ముంగిట నిలబడి అభిమానులను చూస్తూ ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డెసర్ట్ వైపర్స్ ఏడు వికెట్ల తేడాతో ముంబై ఎమిరేట్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పొలార్డ్ 67 నాటౌట్, పూరన్ 57 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్.. అలెక్స్ హేల్స్(44 బంతుల్లో 62 నాటౌట్), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(29 బంతుల్లో 56 నాటౌట్) విధ్వంసం ధాటికి 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. కొలిన్ మున్రో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. #PollyPandey, what have you done! 🤯🤯🤯🤯@KieronPollard55 with a 𝑩𝒂𝒘𝒂𝒂𝒍 one-handed catch and the celebration to match. 😎#MIEvDV #CricketOnZee #DPWorldILT20 #BawaalMachneWalaHai #HarBallBawaal @MIEmirates @ILT20Official pic.twitter.com/2eKZPWjoYk — Zee Cricket (@ilt20onzee) January 24, 2023 చదవండి: టాప్‌లెస్‌గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది' '22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు' -
మూడు పరుగులతో శతకం మిస్.. చేయాల్సిన విధ్వంసం చేసేశాడు
విండీస్ హార్డ్ హిట్టర్ రోవ్‌మెన్ పావెల్ ఇంటర్నేషనల్ లీగ్ టి20(ILT20) క్రికెట్లో తుఫాన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన పావెల్ సిక్సర్ల వర్షం కురిపించాడు. దుబాయ్ క్యాపిటల్స్, ముంబై ఎమిరేట్స్ మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఔటైనప్పటికి చేయాల్సిన విధ్వంసం అంతా చేసిపారేశాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 97 పరుగులు చేసి ఔటయ్యాడు. అతనికి తోడుగా జో రూట్ కూడా 54 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇక వెస్టిండీస్ తరపున రోవ్‌మెన్ పావెల్ 45 వన్డేల్లో 897 పరుగులు, 55 టి20ల్లో 890 పరుగులు సాధించాడు. మ్యాచ్ విషయానికి వస్తే దుబాయ్ క్యాపిటల్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 222 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోవ్‌మెన్ పావెల్ (41 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 97 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. జో రూట్ (54 బంతుల్లో 82, 8 ఫోర్లు, మూడు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన శైలికి విరుద్ధంగా ఆడిన రూట్ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్ కూడా ధీటుగానే బదులిచ్చింది. అయితే చివర్లో ఒత్తిడికి తలొగ్గిన ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కీరన్ పొలార్డ్(38 బంతుల్లో 86, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. The captain came out all guns blazing 💥 A 100+ partnership with Root, 10 6️⃣s, 97 runs 🤩 It was indeed a captain's inning from @Ravipowell26. Book your tickets from https://t.co/VekRYhpzz6#DPWorldILT20 #ALeagueApart #MIEvDC pic.twitter.com/YWYuCo8qFl — International League T20 (@ILT20Official) January 22, 2023 చదవండి: విధ్వంసం సృష్టిస్తున్నాడు.. టెస్టు క్రికెటర్ ముద్ర చెరిపేయాల్సిందే -
విధ్వంసం సృష్టిస్తున్నాడు.. టెస్టు క్రికెటర్ ముద్ర చెరిపేయాల్సిందే
ఇంగ్లండ్ ఆటగాడు జోరూట్ అనగానే టెస్టు స్పెషలిస్ట్ అనే ట్యాగ్ గుర్తొస్తుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో చూసుకుంటే వన్డేలు మాత్రమే ఆడే రూట్ టి20లు చాలా తక్కువగా ఆడాడు. ఇక టెస్టుల్లో తన ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ఎన్నో విజయాలు అందించాడు. టెస్టు స్పెషలిస్ట్ అనే ముద్ర ఉండడంతో ఐపీఎల్, బీబీఎల్ లాంటి లీగ్స్‌లో రూట్ పేరు పెద్దగా కనిపించదు. ఒకవేళ వేలంలో పాల్గొన్నా అతన్ని కొనడానికి ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపేది కాదు. అయితే రూట్కున్న టెస్టు స్పెషలిస్ట్ అనే ట్యాగ్ చెరిపేయాల్సిన సమయం వచ్చినట్లుంది. అబుదాబి వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20లో రూట్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ అందుకు కారణమయింది. ఆదివారం రాత్రి దుబాయ్ క్యాపిటల్స్, ముంబై ఎమిరేట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టానికి 222 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోవ్‌మెన్ పావెల్ (41 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 97 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. జో రూట్ (54 బంతుల్లో 82, 8 ఫోర్లు, మూడు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తన శైలికి విరుద్ధంగా ఆడిన రూట్ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్ కూడా ధీటుగానే బదులిచ్చింది. అయితే చివర్లో ఒత్తిడికి తలొగ్గిన ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కీరన్ పొలార్డ్(38 బంతుల్లో 86, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. We saw the reverse sweep yesterday. Here's the conventional sweep with the SAME precision!@root66 is all class!pic.twitter.com/GRo5zKQAyd — International League T20 (@ILT20Official) January 22, 2023 చదవండి: ఫించ్ 'దంచి కొట్టుడు'.. 35 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో..! -
ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన: కెప్టెన్లుగా కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్..
Kieron Pollard- Rashid Khan As MI Teams captains: వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్, అఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్‌కు ముంబై ఇండియన్స్ యాజమాన్యం రిలయన్స్ కీలక బాధ్యతలు అప్పగించింది. విదేశీ టీ20 లీగ్‌లలో తమ జట్లకు వీరిద్దరిని కెప్టెన్లుగా నియమించింది. ఈ మేరకు ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ప్రకటన విడుదల చేసింది. యూఏఈ ఐఎల్టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌కు కీరన్ పొలార్డ్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌కు రషీద్ ఖాన్ సారథ్యం వహిస్తారని తెలిపింది. వీరిద్దరిపై తమకు పూర్తి నమ్మకం ఉందని.. ఆయా లీగ్‌లలో తమ జట్లను ఉన్నత శిఖరాలకు చేరుస్తారనే నమ్మకం ఉందని పేర్కొంది. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ నాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ముంబై ఫ్రాంఛైజీల కెప్టెన్ల జాబితాలో పొలార్డ్, రషీద్ కూడా చేరడం విశేషం. ముంబై ఇండియన్స్‌కు గుడ్‌బై ఐపీఎల్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన కీరన్ పొలార్డ్ ఇటీవలే ఈ లీగ్‌కు ఆటగాడిగా గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే, అతడు ముంబై బ్యాటింగ్ కోచ్‌గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఈ క్రమంలో యూఏఈ లీగ్‌లో ముంబై జట్టు కెప్టెన్‌గా పోలీని ప్రకటించడం గమనించడం గమనార్హం. గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ ఇక ఐపీఎల్-2022 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు రషీద్ ఖాన్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై జట్టుకు సారథిగా నియమితుడు కావడం విశేషం. ఇదిలా ఉంటే.. గతేడాది ముంబై ఇండియన్స్ వదులుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. గుజరాత్‌ను అరంగేట్ర సీజన్లోనే చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. 🇮🇳🇦🇪🇿🇦 Leaders of the #OneFamily. 💙#MICapeTown #MIEmirates @MIEmirates @MICapeTown @ImRo45 @KieronPollard55 @rashidkhan_19 pic.twitter.com/ngGMQWSrgS — Mumbai Indians (@mipaltan) December 2, 2022 -
IPL: ముంబై విధ్వంసకర ప్లేయర్ సంచలన నిర్ణయం! మిస్ యూ.. ట్విస్ట్ ఇచ్చాడిలా
IPL 2023- Kieron Pollard- Mumbai Indians: వెస్టిండీస్ వెటరన్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్‌గా వెలుగొందిన కీరన్ పొలార్డ్ తన ఐపీఎల్ కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాడిగా కనిపించబోనంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్-2023 మినీ వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ అతడిని రిలీజ్ చేసిన నేపథ్యంలో ఈ మేరకు పోలీ సంచలన ప్రకటన చేశాడు. అపురూప విజయాల్లో భాగమై 2010 నుంచి ముంబై ఫ్రాంఛైజీతో అనుబంధం కొనసాగిస్తున్న 35 ఏళ్ల పొలార్డ్.. ఐదుసార్లు టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా రికార్డు సృష్టించాడు. తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు అనేక విజయాలు అందించాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో ఆటగాడిగా 13 ఏళ్ల తన విజయవంతమైన కెరీర్‌కు గుడ్ బై చెబుతూ మంగళవారం ప్రకటన చేశాడు. అందరికీ ధన్యవాదాలు ఈ మేరకు ట్విటర్లో భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. ఆటగాడిగా ఐపీఎల్‌ను మిస్ అవుతానని.. 2013, 2015, 2017, 2019, 2020తో పాటు 2011 నాటి చాంపియన్స్ లీగ్ గెలవడం ఎన్నటికీ మర్చిపోలేనన్నాడు. తనకు ఇన్నాళ్లు సహకరించిన ముంబై యాజమాన్యానికి పొలార్డ్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. తన భార్య జెనా, తన ముగ్గురు పిల్లలకు కూడా కృతజ్ఞతలు చెప్పాడు. ఓ బ్యాడ్ న్యూస్.. ఓ గుడ్ న్యూస్ తనకు సహకరించిన ముకేశ్, నీత, ఆకాశ్ అంబానీల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్న పొలార్డ్... ముంబైతో తన బంధం ముగిసిపోలేదంటూ ఫ్యాన్స్‌కు ఓ శుభవార్త కూడా చెప్పాడు. ఐపీఎల్లో బ్యాటింగ్ కోచ్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు పొలీ ఈ సందర్భంగా వెల్లడించాడు. అదే విధంగా ముంబై ఎమిరేట్స్ తరఫున ఆటగాడిగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశాడు. తన నోట్‌ను ముగిస్తూ సిన్సియర్లీ కీరన్ పొలార్డ్.. ది ముంబై వెస్ట్ ఇండియన్ అంటూ అభిమానం చాటుకున్నాడు. తనని అభిమానిస్తున్న వాళ్లందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. కాగా పొలార్డ్‌ను ఇక ఐపీఎల్ ఆటగాడిగా చూడలేమా అంటూ ఫ్యాన్స్ ఉద్వేగానికి లోనవుతున్నారు. మిస్ యూ పోలీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక గత సీజన్లో పొలార్డ్ పూర్తిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. 💙 #OneFamily @mipaltan pic.twitter.com/4mDVKT3eu6 — Kieron Pollard (@KieronPollard55) November 15, 2022 🙏𝕋ℍ𝔼 𝕃𝕃𝕆ℝ𝔻 𝗛𝗔𝗦 𝗪𝗢𝗡 𝗜𝗧 𝗔𝗟𝗟 🏆#OneFamily #MumbaiIndians @KieronPollard55 pic.twitter.com/VPWTdWZEdH — Mumbai Indians (@mipaltan) November 15, 2022 -
పార్థివ్ పటేల్‌కు లక్కీ ఛాన్స్.. ఎంఐ ఎమిరేట్స్ బ్యాటింగ్ కోచ్‌గా..
International League T20- MI Emirates Coaching Staff: యూఏఈ ఇంటర్నేషనల్ టీ20 లీగ్ నేపథ్యంలో ఎంఐ ఎమిరేట్స్ తమ జట్టు ప్రధాన కోచ్‌గా షేన్ బాండ్‌ను నియమించింది. అదే విధంగా టీమిండియా మాజీ క్రికెటర్లు పార్థివ్ పటేల్‌ను బ్యాటింగ్ కోచ్‌గా.. వినయ్ కుమార్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ తమ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. అప్పటి నుంచి ముంబై ఫ్రాంఛైజీతో ప్రయాణం ఈ మేరకు ఎంఐ ఎమిరేట్స్ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ షేన్ బాండ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. 2015 నుంచి ఈ ఫ్రాంఛైజీతో అతడి ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి నాలుగు సార్లు(2013 మినహా) టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. కోచ్‌లకు స్వాగతం! ఎంఐ ఎమిరేట్స్ కోచ్‌ల నియామకం నేపథ్యంలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. ఎంఐ ఎమిరేట్స్ కుటుంబంలోకి షేన్, పార్థివ్, వినయ్‌లకు స్వాగతం పలికారు. ముంబై ఇండియన్స్ మాదిరిగానే.. వారికున్న అపార అనుభవంతో కొత్త జట్టును కూడా విజయపథంలో నడిపిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నాకు దక్కిన గౌరవం! ఇక తన నియామకంపై షేన్ బాండ్ స్పందిస్తూ.. ఎంఐ ఎమిరేట్స్ హెడ్‌కోచ్‌గా ఎంపిక కావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతూ.. ఎంఐ ఎమిరేట్స్ స్థాయిని మరింతగా పెంచేందుకు కృషి చేస్తానని వెల్లడించాడు. కాగా యూఏఈ లీగ్ వచ్చే ఏడాది ఆరంభం కానుంది. ఈ లీగ్ ద్వారా పార్థివ్ పటేల్, వినయ్ కుమార్ కోచ్‌లుగా ఎంఐ ఎమిరేట్స్ తరఫున అరంగేట్రం చేయనున్నారు. చదవండి: అతడు జట్టులో లేకపోవడం టీమిండియాకు తీరని లోటు: శ్రీలంక మాజీ కెప్టెన్ అదరగొట్టారు.. ఎవరీ పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవ? 𝘿𝙖𝙫𝙖𝙣𝙜𝙚𝙧𝙚 Express is here 🔥 We are excited to announce that @Vinay_Kumar_R has joined MI Emirates as the bowling coach! 🤩#OneFamily #MIemirates @ILT20Official pic.twitter.com/z5spZNsi4j — MI Emirates (@MIEmirates) September 17, 2022 -
'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు
ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా పేరుపొందిన ముంబై ఇండియన్స్ క్రికెట్ సౌతాఫ్రికా, యూఏఈ లీగ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టి జట్లను కొనుగోలు చేసింది. కొనుగోలు చేయడమే కాదు అందరికంటే ముందుగా తమ కొత్త జట్ల పేర్లను ప్రకటించడంతో పాటు ఆటగాళ్లను పరిచయం చేసింది. సీఎస్ఏ టి20 లీగ్‌లో 'ఎంఐ కేప్‌టౌన్'(MI Capetown).. యూఏఈ టి20 లీగ్‌లో 'ఎంఐ ఎమిరేట్స్'(MI Emirates)ను జట్లుగా ప్రకటించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్. తాజాగా యూఏఈ ఇంటర్నేషనల్ టి20లో తమ జట్టుకు ప్రాతినిథ్యం వహించబోయే జట్టును కూడా ప్రకటించింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఈ జట్టులో పెద్దపీట వేసింది. 14 మందితో కూడిన ఈ జట్టులో ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్, విండీస్ మాజీ సారథి కీరన్ పొలార్డ్‌తో పాటు నికోలస్ పూరన్, డ్వేన్ బ్రావో, ఆండ్రీ ఫ్లెచర్‌లు కూడా ఉన్నారు. ఇక ఐపీఎల్లో గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడిన ట్రెంట్ బౌల్ట్‌ను మళ్లీ జట్టులో చోటు కల్పించింది. వీరితో పాటు ఇంగ్లండ్ నుంచి సమిత్ పటేల్, విల్ సమీద్, జోర్డాన్ థాంప్సన్ లు ఉన్నారు. అఫ్ఘనిస్తాన్ బౌలర్ జహీర్ ఖాన్, ఫజల్హక్ ఫరూఖీలను ఎంపిక చేసింది. సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌కు అవకాశం దక్కింది. ఈ మేరకు ఎంఐ ఎమిరేట్స్ జట్టును తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించింది. యూఏఈ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టి20(ఐఎల్టీ20) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12వరకు జరగనుంది. లీగ్ మార్గదర్శకాలను అనుసరించి తమ ఫ్రాంచైజీకి ఆటగాళ్లు ఒప్పందాలు చేసుకున్నారని, ఇక స్థానిక (యూఏఈ) క్రికెటర్లు కూడా వీరికి జతకలుస్తారని ఎంఐ ఎమిరేట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా జట్టు ఓనర్ ఆకాశ్ అంబానీ స్పందిస్తూ.. ‘మా జట్టుకు చెందిన 14 మంది ఆటగాళ్లను పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ముంబై ఇండియన్స్‌లో కీలక ఆటగాడైన పొలార్డ్.. ఎమిరేట్స్‌లో మాతోనే కొనసాగుతున్నాడు. బ్రావో, బౌల్డ్, పూరన్ లు మళ్లీ మాతో చేతులు కలపనున్నారు. ఎమిరేట్స్ జట్టుకు ఆడబోయే ఆటగాళ్లకు స్వాగతం.’అని పేర్కొన్నాడు. ఐఎల్టీ20కి ఎంఐ ఎమిరేట్స్ జట్టు: కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, అండ్రె ఫ్లెచర్, ఇమ్రాన్ తాహిర్, సమిత్ పటేల్, విల్ సమీద్, జోర్డాన్ థాంప్సన్, నజిబుల్లా జద్రాన్, జహీర్ ఖాన్, ఫరూఖీ, బ్రాడ్లే వీల్, బాడ్ డీ లీడే The 𝗟𝗹𝗼𝗿𝗱, the 𝗟𝗲𝗴𝗲𝗻𝗱 & his 𝗟𝗲𝗴𝗮𝗰𝘆! @KieronPollard55 will don the iconic Blue and Gold in IL T20 💙 🗞️ Read more: https://t.co/RMiQOJfj9N#OneFamily #MIemirates @MIEmirates @EmiratesCricket pic.twitter.com/C1flVytrpI — Mumbai Indians (@mipaltan) August 12, 2022 చదవండి: MI Capetown: ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన ఎంఐ కేప్‌టౌన్.. రబడ సహా.. Mumbai Indians: విదేశీ లీగ్స్‌లోనూ తనదైన ముద్ర..


